Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' నుండి షాలిని అవుట్.. కానీ ట్విస్ట్...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి షాలిని అవుట్.. కానీ ట్విస్ట్ ఏమిటంటే!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో , షో పై బలమైన ప్రభావం చూపించిన వారిలో ఒకరు షాలిని. కచ్చితంగా ఈమె టాప్ 5 లో ఉండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ , అందులో ఎలాంటి సందేహం లేదు. గేమ్స్ వచ్చినప్పుడు తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వగలదు , మగవాళ్ళతో సైతం పోటీ పడగలదు, […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో , షో పై బలమైన ప్రభావం చూపించిన వారిలో ఒకరు షాలిని. కచ్చితంగా ఈమె టాప్ 5 లో ఉండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ , అందులో ఎలాంటి సందేహం లేదు. గేమ్స్ వచ్చినప్పుడు తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వగలదు , మగవాళ్ళతో సైతం పోటీ పడగలదు, వాదనలు వచ్చినప్పుడు చాలా బలమైన పాయింట్స్ ని పెట్టగలదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ గత రెండు వారాల నుండి రోహిత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడం తో , ఈమె గేమ్ బాగా డౌన్ అయ్యింది. దానికి తోడు తన తోటి కంటెస్టెంట్స్ తో కొట్లాడడం వంటివి కూడా షాలిని గ్రాఫ్ ని మరింత తగ్గించేలా చేశాయి. వైల్డ్ కార్డ్స్ కూడా బయట ఈమెకు పెరిగిన నెగెటివిటీ ని గమనించి , ఆమెకు హౌస్ లో ఉండేందుకు అర్హత లేదని ఓట్లు వేశారు. దీంతో షాలిని కి కూడా తనకు బయట బాగా నెగెటివిటీ పెరిగిపోయింది అనే విషయం అర్థం అయిపోయింది.

తాను ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రోహిత్ తో కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. బయటకు వెళ్లిన తర్వాత పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకుంటానని చెప్పింది. ఆమె ఊహించినట్టుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. కానీ ఎలిమినేట్ అయ్యాక ఆమెని నేరుగా ఇంటికి పంపించలేదు, సీక్రెట్ రూమ్ కి పంపించారు అట. ఈ అప్డేట్ బయటకు రాగానే అందరూ ఒక్కసారిగా సర్ప్రైజ్ కి గురయ్యారు. ఎందుకంటే గడిచిన రెండు సీజన్స్ నుండి అసలు సీక్రెట్ రూమ్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించలేదు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ లో షాలిని వర్త్ కాండిడేట్, ఆమె నుండి బోలెడంత కంటెంట్ వస్తుంది అనే ఉద్దేశ్యం తో సీక్రెట్ రూమ్ లో పెట్టినట్టు సమాచారం.

ఒక రెండు రోజుల పాటు సీక్రెట్ రూమ్ లో పెట్టి , ఆ తర్వాత ఆమె చేతిలో ఒక స్పెషల్ పవర్ పెట్టి హౌస్ లోకి తిరిగి పంపే అవకాశాలు ఉన్నాయి. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో షాలిని కి నాగార్జున ఒక రేంజ్ లో కోటింగ్ ఇస్తుంటాడు. అంతే కాదు , నీతూ మాస్టర్ , రోహిత్ ఇద్దరు షాలిని గురించి మాట్లాడుకున్న కొన్ని వీడియోలను కూడా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి చూపించారట. ఇప్పుడు సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన షాలిని , రెండు రోజులు రోహిత్ ని బాగా పరిశీలించి , అతను తన కోసం బాధపడుతున్నాడో లేదో తెలుసుకొని, లోపలకు వచ్చిన తర్వాత అతనితో గొడవ పడడమో, లేదంటే నీతూ మాస్టర్ తో వైరం పెంచుకోవడమో జరగొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper