spot_img
Homeఎంటర్టైన్మెంట్Aranya: ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న రానా ‘అరణ్య’ మూవీ ...

Aranya: ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న రానా ‘అరణ్య’ మూవీ …

Aranya: బాహుబలి ఘనవిజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఈ దగ్గుబాటి హీరో. అయితే మొదటి నుంచి  వినూత్న క‌థ‌లు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఇటీవల ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అర‌ణ్య‌’. ప్ర‌భు సాల్మ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా … ఈ ఏడాది మార్చి 26న విడుద‌లైంది. కానీ క‌రోనా ప‌రిస్థితుల్లో బాక్సాఫీస్‌ వద్ద మాత్రం అనుకున్నంత కలెక్షన్ లను రాబట్టలేకపోయింది.

rana-aranya-ovie-released-in-zee-5-ott

ఈ మూవీ విషయానికి వస్తే విశాఖపట్నం సమీపంలోని చిలకలకోన అడవి. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే కుటుంబంలో పుట్టి పెరుగుతాడు హీరో రానా. ఏనుగుల రక్షణ కోసం కృషి చేసినందుకు గానూ…  ఆయ‌నకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి అవార్డు సాధిస్తాడు. అదే సమయంలో కేంద్రమంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం చిల‌క‌ల‌కోన అడవిపై కన్నేస్తాడు. అడవిని న‌రికి అక్క‌డ టౌన్‌షిప్ కట్టేందుకు ప్లాన్ చేస్తాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న‌ ఏనుగులు అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిపై  రానా ఎలా పోరాటం చేశారు… అడ‌విని ఎలా దక్కించుకున్నారన్నది కథ.

అయితే… ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ భావించారు. ద‌స‌రా కానుకగా ఈరోజు నుంచి జీ5 లో  ‘అరణ్య’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శ్రియ, జోయా హుస్సేన్‌లు ప్రముఖ పాత్రల్లో కన్పించనున్నారు. ఈ చిత్రానికి శాంతను సంగీతం అందించగా…  తెలుగు, తమిళం , హింది భాషల్లో రిలీజ్ అయ్యింది   ఏరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper