Homeవింతలు-విశేషాలుChimpanzee Mother Love: అమ్మ.. మనుషులకే కాదు.. జంతువులకూ బలమైన అండ.. కన్నీరు తెప్పిస్తున్న వీడియో..

Chimpanzee Mother Love: అమ్మ.. మనుషులకే కాదు.. జంతువులకూ బలమైన అండ.. కన్నీరు తెప్పిస్తున్న వీడియో..

Chimpanzee Mother Love: ఈ సృష్టికి మూలం అమ్మ. సకల జగత్తుకు ఆది అమ్మ. అమ్మ గురించి చెప్పడానికి.. అమ్మ గురించి వర్ణించడానికి.. అమ్మ గురించి వివరించడానికి మాటలు సరిపోవు. గ్రంధాలు సరితూగవు. పదాలు వివరించలేవు. ఈ సృష్టిలో అమ్మ ఎవరికైనా సరే అమ్మనే. మనుషుల మధ్య ఎంతటి బలమైన బంధాలు ఉంటాయో.. జంతువుల మధ్య కూడా అలాంటి బంధాలే ఉంటాయి. మనుషులను అమ్మ ప్రేమ ఎలాగైతే కట్టిపడేస్తుందో.. జంతువులని కూడా అలాగే నియంత్రించ కలుగుతుంది. మంచిని […]

Chimpanzee Mother Love: ఈ సృష్టికి మూలం అమ్మ. సకల జగత్తుకు ఆది అమ్మ. అమ్మ గురించి చెప్పడానికి.. అమ్మ గురించి వర్ణించడానికి.. అమ్మ గురించి వివరించడానికి మాటలు సరిపోవు. గ్రంధాలు సరితూగవు. పదాలు వివరించలేవు.

ఈ సృష్టిలో అమ్మ ఎవరికైనా సరే అమ్మనే. మనుషుల మధ్య ఎంతటి బలమైన బంధాలు ఉంటాయో.. జంతువుల మధ్య కూడా అలాంటి బంధాలే ఉంటాయి. మనుషులను అమ్మ ప్రేమ ఎలాగైతే కట్టిపడేస్తుందో.. జంతువులని కూడా అలాగే నియంత్రించ కలుగుతుంది. మంచిని నేర్పే అమ్మ ప్రేమ.. చెడును దూరంగా ఉంచుతుంది. ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. గెలుపును బానిసగా మార్చుతుంది. అందువల్లే అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదు. అమ్మ నిలబడినచోట ఓటమికి ఆస్కారం ఉండదు. అలాంటిదే ఈ వీడియో కూడా..

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియోలో ఓ చింపాంజీ.. దాని వడిలో బుల్లి చింపాంజీ ఉంది. ఓ పార్కులో చింపాంజీ తన బుల్లి చింపాంజితో కలిసి సేద తీరుతుంది. దానిని చూసేందుకు సందర్శకులు వచ్చారు. అందులో ఒక పాప కూడా ఉంది. ఆ పాపకు చింపాంజీని చూడగానే ముచ్చట వేసింది. ఇంకేముంది దానితో ఆడుకోవాలి అనుకుంది. ఒక ఇనుప బొంగుకు దారాన్ని అటు ఇటుగా ఏర్పాటుచేసి ఒకవైపు బుల్లి చింపాంజీ.. మరోవైపు ఆ పాప లాగడం మొదలు పెట్టింది. ఆ పాప గట్టిగా లాగడంతో గెలిచే దిశగా ప్రయాణం సాగించింది. ఈ క్రమంలో తల్లి చింపాంజీ ఒక్కసారిగా రంగంలోకి దిగింది. ఆ దారాన్ని ఒక్కసారిగా లాగింది.. దీంతో ఆ పాప చేతిలో నుంచి దారం మొత్తంగా తల్లి చింపాంజీ చేతిలోకి వచ్చేసింది. దీంతో ఆ చిన్నారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా బాగుందని చెబుతున్నారు. తల్లి ఉన్నచోట బిడ్డకు ఓటమి ఉండదు. ఓటమిని తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ముఖ్యంగా బిడ్డ ఓడిపోతుంటే తల్లి అసలు ఓర్చుకోలేదు. మనుషులే కాదు.. చివరికి జంతువులు కూడా తల్లి ప్రేమకు బానిసలే. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. బిడ్డ గెలిచిన తర్వాత ప్రపంచాన్నే జయించినంత ఆనందంలో తల్లి ఉంటుంది. తల్లి ప్రేమకు అవధులు ఉండవు. బిడ్డపై ఉన్న సాంగత్యానికి కొలమానాలు ఉండవు. అమ్మ అంటేనే అద్భుతం. ఆమె ప్రేమ అనన్య సామన్యం..అనితర సాధ్యం.

 

View this post on Instagram

 

A post shared by No. 1 channel (@no.1news_official)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper