Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: స్టార్ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లాడిన రామ్ గోపాల్ వర్మ..వీడియో వైరల్..

Ram Gopal Varma: స్టార్ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లాడిన రామ్ గోపాల్ వర్మ..వీడియో వైరల్..

Ram Gopal Varma: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫేమ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి యూత్ ఆడియన్స్ సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ టేకింగ్ కి ఎంత మెంటలెక్కిపోతున్నారో , అప్పట్లో రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కి అదే రేంజ్ లో వెర్రెక్కిపోయేవారు. శివ సినిమాతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రామ్ గోపాల్ […]

Ram Gopal Varma: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫేమ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి యూత్ ఆడియన్స్ సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ టేకింగ్ కి ఎంత మెంటలెక్కిపోతున్నారో , అప్పట్లో రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కి అదే రేంజ్ లో వెర్రెక్కిపోయేవారు. శివ సినిమాతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి లెజెండ్ స్థాయిని సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కువగా బాలీవుడ్ లోనే స్థిరపడ్డారు. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా అందరి లాగానే తన ట్రేడ్ మార్క్ ని చూపించడం కోసం , తన ప్రతీ సినిమాకు గతం లో పని చేసిన నటీనటులనే తీసుకుంటూ ఉంటారు.

అలా ఆయన ఆరోజుల్లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్మిళ తో అత్యధిక సినిమాలు చేశారు. ముందుగా 1995 వ సంవత్సరం లో ‘రంగీలా’ అనే బాలీవుడ్ చిత్రం తో వీళ్లిద్దరి జర్నీ మొదలైంది. ఆరోజుల్లో ఈ సినిమా ఒక సంచలనం. బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ షేక్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘కౌన్’, ‘భూత్’, ‘జంగిల్’, ‘అనగనగ ఒక రోజు’, ‘మస్త్ ‘, ‘గాయం’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిల్లో అత్యధిక శాతం సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే మన ఇండస్ట్రీ ఒక డైరెక్టర్ , ఒక హీరోయిన్ కలిసి వరుసగా సినిమాలు చేస్తే , వాళ్ళ మధ్య కచ్చితంగా ఎదో జరుగుతుంది అంటూ రూమర్స్ పుట్టించడం సర్వసాధారణమే. ఎప్పటి నుండో ఇలాంటి రూమర్స్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలా వీళ్లిద్దరి గురించి ఇండస్ట్రీ లో రూమర్స్ చాలానే నడిచాయి.

రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ , ఊర్మిళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ రామ్ గోపాల్ వర్మ , ఊర్మిళ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ రహస్యాన్ని నాకు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఊర్మిళ కి ఫోన్ చేశాను. ఆమె చాలా ఎమోషనల్ అయిపోయారు కానీ , ఈ వార్తని మాత్రం ఖండించలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper