Director Teja: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వాళ్లను స్టార్లుగా మార్చిన దర్శకులను ఎవరూ పట్టించుకోరు. సినిమా సక్సెస్ అయితే హీరో ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడి మిస్టేక్ వల్లే ఆ సినిమా ఆడలేదంటూ అందరూ అతన్ని దూషిస్తారు. 24 క్రాఫ్ట్స్ ను హ్యాండిల్ చేస్తూ హీరోలను టాప్ రేంజ్ లో చూపించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులకు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ లు వరిస్తాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. తేజ లాంటి దర్శకుడు సైతం కెరియర్ మొదట్లో శివ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో నటించడానికి కొంతమంది రౌడీలు కావాల్సి వచ్చారట. దాంతో హైదరాబాద్ లో ఒరిజినల్ గా ఉన్న కొంతమంది రౌడీలను తీసుకొచ్చి సినిమాలో పెట్టారు.
సినిమా షూటింగ్ జరుగుతున్న మధ్యలో పోలీసులు వచ్చి వాళ్ళను జైలుకు తీసుకెళ్తే తేజ వెళ్లి వాళ్లకు బెయిల్ ఇచ్చి మరి వాళ్ళను తీసుకువచ్చి వాళ్ల చేత షూటింగ్ చేయించేవారట. కొద్దిరోజుల పాటు ఇదే తంతూ జరిగేదట. ఇక ఏది ఏమైనా కూడా శివ సినిమా సూపర్ సక్సెస్ అయింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు.
అతని దగ్గర వర్క్ చేసిన తేజ, గుణశేఖర్, కృష్ణవంశీ లాంటి వారు ఆ తర్వాత దర్శకులుగా మరి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు. మొత్తానికైతే తేజ లవ్ స్టోరీస్ ను తీయడంలో దిట్ట అనే గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పటికి ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్న కూడా అవేవి ప్రేక్షకులను పెద్దగా ఇంపాక్ట్ కి గురి చేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తేజ రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించి మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…