Chiranjeevi And Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి.ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలను సైతం ప్రేక్షకులందరు గుర్తించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన చేసిన ‘లంకేశ్వరుడు’ సినిమా అతనికి భారీ డామేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. ముఖ్యంగా ‘పసివాడి ప్రాణం’ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత వచ్చిన లంకేశ్వరుడు భారీ విమర్శలను మూటగట్టుకోవడంతో చిరంజీవి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. ఈ సినిమా నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చింది. దాసరి నారాయణరావు సైతం శివ సినిమా ఛాయలతో ఈ సినిమాని రూపొందించాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు.
ఒకరకంగా శివ మేనియాలో కొట్టుకుపోయిన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటూ అప్పట్లో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో వరుస సక్సెస్ లను అందించాడు.
మరి అలాంటి హీరో సైతం ఒకానొక సందర్భంలో ప్లాపులను మూటగట్టుకోవడం అనేది నిజంగా అతని అభిమానులను నిరాశపరిచే విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని సినిమాలతో తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ఇప్పటికీ ఆయన తన స్టామినాను విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఇక ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో ‘కాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గా చిరంజీవి బర్త్ డే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా తన అభిమానుల్లో ఒక కాన్ఫిడెంట్ అయితే నింపింది…