Sandeep Reddy Vanga: ఇప్పటి తరానికి సందీప్ వంగ ఎలాగో , అప్పటి తరానికి రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట. ఇద్దరూ ఒకే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ టేకింగ్ మిగిలిన దర్శకులతో పోలిస్తే చాలా బోల్డ్ గా విభిన్నంగా ఉంటుంది. అప్పటి యూత్ ఆడియన్స్ లో వర్మ అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో, ఇప్పటి యూత్ ఆడియన్స్ కి సందీప్ వంగ అంటే అలాంటి క్రేజ్ ఉంది. మరో విశేషం ఏమిటంటే సందీప్ వంగ రామ్ గోపాల్ వర్మ కి వీరాభిమాని. ఈ విషయాన్ని సందీప్ అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అంతే కాదు , వర్మ తో కలిసి ఆయన అనేక ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ లో వీళ్లిద్దరి సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీళ్లిద్దరు ఎప్పుడు కలిసిన , స్నేహితులు మందు సిట్టింగ్ వేసే సమయంలో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది.
రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో స్టేజి మీదకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ , ఈవెంట్ నిర్వాహకులు వేసిన పాటకు చిందులు వేస్తారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఉత్సాహాన్ని చూసి , ఒక అభిమాని లాగా సందీప్ వంగ పక్కనే నిల్చొని ఈలలు వెయ్యడం హైలైట్ గా నిల్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే సందీప్ వంగ ఈ ఈవెంట్ లో స్పిరిట్ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. షూటింగ్ చాలా అద్భుతంగా జరుగుతోందని , ఇప్పటి వరకు 40 శాతం పూర్తి అయ్యిందని , ఈ ఏడాది లోనే సినిమా మొత్తాన్ని పూర్తి చేసి , మార్చి 5 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నామని చెప్పుకొచ్చారు సందీప్ వంగ.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాగుతోంది. ప్రభాస్ ఈ సినిమాని పూర్తి చేయడానికి కాల్ షీట్స్ మొత్తాన్ని కేటాయించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నెలాఖరులోపు ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. సందీప్ వంగ కి సినిమాని పూర్తి చేసిన తర్వాత పాటలను కంపోజ్ చేయించే అలవాటు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదే చేయబోతున్నారు. అక్టోబర్ లో షూటింగ్ పూర్తి అయ్యాక పాటలను కంపోజ్ చేయించి , హీరో హీరోయిన్ పై చిత్రీకరిస్తారట. ఈ చిత్రం లో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమిరి నటిస్తుండగా , విలన్స్ గా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు.
— Vangaism (@imvangaism) July 19, 2026
