Ram Gopal Varma: శివ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఆయన మూట గట్టుకున్న డిజాస్టర్లు మరొకెత్తనే చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ అనునిత్యం సోషల్ మీడియాలో కనిపించే ఆర్జీవి తన దగ్గర శిష్యులుగా పని చేసిన చాలామందిని దర్శకులుగా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. అజయ్ భూపతి లాంటి దర్శకుడు సైతం ఆర్జీవీ దగ్గర ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాకి కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఆయన సినిమాతో దర్శకుడిగా మారి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో అజయ్ భూపతి మరొక అసోసియేట్ డైరెక్టర్, అలాగే రామ్ గోపాల్ వర్మ ముగ్గురు ఒకే బైక్ మీద వెళ్తున్నప్పుడు దిగిన ఫోటో ఒకటి ఆ తర్వాత ట్విట్టర్ లో ఆ ఫోటో ను యాడ్ చేస్తూ దమ్ముంటే పోలీసు వాళ్లు మమ్మల్ని పట్టుకోండి అంటూ ఒక ట్వీట్ అయితే వేశారట.
దాంతో సీరియస్ గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్స్ వర్మ దగ్గరికి రోజుకొక కానిస్టేబుల్ ను పంపించేవారట. ఆ సమయంలో వర్మ ఆఫీసులో ఉండేవాడు కాదట. అజయ్ భూపతి ఉండేవాడట ఆ పోలీసులు అజయ్ భూపతిని రిక్వెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక సంతకం పెట్టి వెళ్ళండి అని ఎంత బతిమిలాడినా కూడా అజయ్ వినేవాడు కాదట.
ఆ ట్వీట్ చేసింది ఆయన మీరు ఆయన్ని పట్టుకెళ్ళండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అంటూ ఆయన సమాధానం చెప్పేవారట. కానీ వర్మ మాత్రం పోలీసులకు దొరికేవాడు కాదట. మొత్తానికైతే అజయ్ భూపతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్జీవి వల్లే ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లనని చెప్పాడు.
వర్మ ఇలాంటి కొన్ని పనులు చేస్తూ పక్క వాళ్ళని ఇరికిస్తూ ఉంటాడని అజయ్ భూపతి ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. ప్రస్తుతం ఆర్జీవి ఎలాంటి సినిమాలు చేయడం లేదు. గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ప్రస్తుతానికి ఆయన సినిమాలేవి లేకుండా ఖాళీగానే ఉంటున్నాడు…