Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: 'రాకా' లోకి హాలీవుడ్ యాక్షన్ హీరో ఎంట్రీ.. ఇది అల్లు అర్జున్...

Allu Arjun: ‘రాకా’ లోకి హాలీవుడ్ యాక్షన్ హీరో ఎంట్రీ.. ఇది అల్లు అర్జున్ రేంజ్ అంటే..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాకా’ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి , థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. లక్షల్లో ఈ మూవీ థీమ్ మ్యూజిక్ పై రీల్స్ పడ్డాయి. అంతటి క్రేజ్ ని […]

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాకా’ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి , థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. లక్షల్లో ఈ మూవీ థీమ్ మ్యూజిక్ పై రీల్స్ పడ్డాయి. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా కి మాత్రమే పరిమితం అని ఇన్ని రోజులు అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ ప్లానింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా లెవెల్ కి పరిమితం చేయడం లేదట, పాన్ వరల్డ్ రేంజ్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ ని తీసుకొని రావడానికి హాలీవుడ్ యాక్షన్ హీరో ‘విల్ స్మిత్’ ని తీసుకున్నారట. ఈ చిత్రం లో ఆయన ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. చాలా రోజుల నుండి విల్ స్మిత్ డేట్స్ కోసం అట్లీ పోరాడాడు అట. రీసెంట్ గానే విల్ స్మిత్ అపాయింట్మెంట్ తీసుకొని, అతన్ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడట. విల్ స్మిత్ కి తన పాత్ర తెగ నచ్చేసింది అట. త్వరలోనే నార్త్ అమెరికా లో ప్లాన్ చేసిన షెడ్యూల్ లో విల్ స్మిత్ కూడా పాల్గొనబోతున్నట్టు టాక్. ఆయన డేట్స్ కి తగ్గట్టుగా షెడ్యూల్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్ అట్లీ. హాలీవుడ్ చిత్రాలను రెగ్యులర్ గా అనుసరించే వాళ్లకు విల్ స్మిత్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

హాలీవుడ్ లో నెంబర్ 1 సూపర్ స్టార్ అని ఆయన్ని ట్రేడ్ పరిగణిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో ఆయన హీరో గా నటించాడు. బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ఆయన సినిమాలకు వచ్చాయి. అందుకే ఆయన్ని కేవలం అతిథి పాత్రకి మాత్రమే పరిమితం చేయకుండా, హీరో ని మించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ తో మంచి స్క్రీన్ టైం లో చూపించబోతున్నాడట డైరెక్టర్ అట్లీ. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ బయటకు రానుంది. ఒక భారీ ఇంటర్నేషనల్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి , ఈ విషయాన్నిచాలా గ్రాండ్ గా ప్రకటించబోతున్నారట మేకర్స్. ఇదే కనుక జరిగి, ‘రాకా’ కి మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ రికార్డ్స్ కి టార్గెట్ పెడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper