Homeఎంటర్టైన్మెంట్Allu Arjun vs Ranveer Singh : అల్లు అర్జున్ vs రణ్వీర్ సింగ్ మధ్య...

Allu Arjun vs Ranveer Singh : అల్లు అర్జున్ vs రణ్వీర్ సింగ్ మధ్య పోటీ ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు సాధించిన హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పెర్సనల్ విషయాల్లో ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినీ విషయంలో మాత్రం పోయి ఉంటుంది. పుష్ప, పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన నటుడు అల్లు అర్జున్… పుష్ప 2 సినిమాతో ఏకంగా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అంతటి కలెక్షన్స్ ని సాధించిన హీరో మరెవరు లేకపోవడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం […]

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు సాధించిన హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. పెర్సనల్ విషయాల్లో ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినీ విషయంలో మాత్రం పోయి ఉంటుంది. పుష్ప, పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన నటుడు అల్లు అర్జున్… పుష్ప 2 సినిమాతో ఏకంగా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అంతటి కలెక్షన్స్ ని సాధించిన హీరో మరెవరు లేకపోవడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ఇక దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రన్వీర్ సింగ్ సైతం అల్లు అర్జున్ కి పోటీని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్టులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.

ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా కాన్సెప్ట్ లను రెడీ చేయించుకొని మరి రన్వీర్ సింగ్ రంగంలోకి దిగుతున్నాడు. దురంధర్, దురంధర్ 2 సినిమాలు రెండు పార్టులు కలిపి 2500 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాయి. దాంతో రన్వీర్ సింగ్ సైతం ఒక్క సంవత్సర వ్యవధిలోనే రెండు సినిమాలతో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక దురంధర్ సినిమా అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ కి నేను పోటీని ఇస్తానని బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ మాట్లాడాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. వీళ్ళిద్దరి నుంచి ఇక మీదట రాబోయే మూడు సినిమాలతో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper