Raaka Movie: గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో యూత్ లో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో తన పరిధిని విస్తరించుకున్నాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో తనకు ఎదురెవరు లేరనే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న రాకా సినిమాతో మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో తను డిఫరెంట్ క్యారెక్టర్స్ ను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందుకు అనుగుణంగానే మరొక క్యారెక్టర్ లో కూడా అల్లు అర్జున్ నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక లేడీ గెటప్ కూడా ఉందట. అందులో కూడా అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో ఆయన లేడి గెటప్ వేసి ప్రేక్షకులందరిని అలరించాడు.
కాబట్టి మరోసారి దాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో కూడా అలాంటి గెటప్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక అట్లీ ఈ సినిమాను చాప బాగా తెరకెక్కిస్తాడనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు కాబట్టి దీనిని ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా మలుస్తాడు ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…