Rajamouli Son: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఆయన ఎమోషన్స్, ఎలివేషన్స్ బ్యాలెన్స్ చేస్తు కమర్షియల్ సినిమా టెంపులేట్ లోనే సినిమాలు చేస్తాడు. అందుకే ఆయన మూవీస్ మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. బీ,సీ సెంటర్లోని ఆడియన్స్ ఒకటికి రెండుసార్లు ఆయన సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎమోషన్ ని హోల్డ్ చేసి యాక్షన్ తో ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ క్రియేట్ చేయగలగడం రాజమౌళి స్పెషాలిటీ… అలాంటి రాజమౌళి తన కొడుకు అయిన కార్తికేయను సినిమా ఇండస్ట్రీలోనే ఉంచుతున్నాడు. బాహుబలి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కార్తికేయ ప్రస్తుతం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి…
రాజమౌళి దగ్గర పనిచేసే ఒక అసోసియేట్ డైరెక్టర్ కార్తికేయ ను హీరోగా పెట్టి ఒక సినిమాని స్టార్ట్ చేశారట. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత రాజమౌళి కార్తికేయ హీరోగా మారడం కంటే బిజినెస్ చూసుకుంటే బెటర్ వాడికి సినిమాలు సెట్ అవ్వవు వాడికి బిజినెస్ ఏ బెస్ట్ అని ఆ సినిమాని క్యాన్సల్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి తన కొడుకు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కార్తికేయ కి బిజినెస్ అంటే చాలా ఇష్టం వాడికి దాంట్లోనే ఎక్కువగా స్కిల్స్ ఉన్నాయని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ బిజినెస్ రంగంలో రాణిస్తాడు అంటూ రాజమౌళి చెబుతున్నాడు.
కార్తికేయ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతాడా లేదంటే ప్రత్యేకంగా బిజినెస్ లు ఏమైనా పెట్టుకుని ముందుకు సాగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధిస్తే ప్రొడ్యూసర్ గా మొదటి సక్సెస్ ను సాధించిన వాడవుతాడు…