YSRCP: వైసీపీలో జగన్ ఏది చెప్తే అది సాగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి.. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి.. ఎవరికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేక కష్టాలు పడిన తర్వాత అధికారం వచ్చింది. రాత్రికి రాత్రి ఆయన ముఖ్యమంత్రి అయిపోలేదు. దీని వెనక ఎంతో మంది కష్టం దాగి ఉంది.
సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలోకి చాలామంది చేరిపోతారు. అలా ఆయన కూడా చేరిపోయారు. ఆయనకు జర్నలిజం నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఒకరకంగా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులను సైతం జగన్మోహన్ రెడ్డిని దూరం చేయగలిగారు. ఇందులో విజయం కూడా సాధించగలిగారు. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం కంటే ముందుగానే సమాధానాలను సిద్ధం చేస్తారు ఆ నెంబర్ వన్ నాయకుడు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా సరే చెల్లుబాటుగా మారిపోయేది. చివరికి జగన్మోహన్ రెడ్డి కంటే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది నాయకులు తాపత్రయపడేవారు. ఆయన చేతిలో అంతా ఉండేది. అందువల్లే ఆయనను షాడో బాస్ అని పిలిచేవారు. కొన్ని సందర్భాలలో ఆయన సకల శాఖలకు మంత్రిగా వ్యవహరించేవారు. ఇప్పుడు వైసీపీకి అధికారం పోయింది..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చాలామందిని దూరం చేశారు. టికెట్ల కేటాయింపులు కూడా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ నెంబర్ వన్ నాయకుడి అసలు రూపం బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కార్యకర్తల సోషల్ మీడియా గ్రూపులలో సదరు నాయకుడి మీద విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. వాస్తవానికి ఈ పని టిడిపి లేదా బిజెపి లేదా జనసేన చేయాలి. అలాకాకుండా వైసిపి కార్యకర్తలే ఇలాంటి పనిచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఆయన మీద వారికి ఏ స్థాయిలో కోపం ఉంటే ఇలా చేస్తారని విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దండిగా నే వెనకేసిన ఆ నాయకుడు ఇప్పుడు త్వరలోనే ప్యాకప్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాలలో కంపెనీలు.. ఇతర వ్యవహారాలు ఆయన గట్టిగానే సాగించినట్లు సమాచారం. నిజంగానే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారా.. లేదా ప్రత్యర్థి పార్టీలు సాగిస్తున్న సోషల్ మీడియా ప్రచారంలో ఇది భాగమా.. ఇది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.. ఆ తర్వాత గాని అసలు విషయం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఫ్యాను పార్టీలో కుంపటి రగిలిందని అర్థమవుతుంది. అయితే అది ఏ స్థాయిలో మంటగా మారుతుందో.. ఎలాంటి దహనానికి కారణం అవుతుందో రోజులు గడిస్తే గాని తెలియదు.