Homeబిజినెస్Mahindra Thar OG : రూ.10.32 లక్షలకే మహీంద్రా Thar OG.. కొత్త ఇంజిన్లు, 19-ఇంచ్...

Mahindra Thar OG : రూ.10.32 లక్షలకే మహీంద్రా Thar OG.. కొత్త ఇంజిన్లు, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, అదిరిపోయే ఫీచర్లు!

Mahindra Thar OG : మహీంద్రా థార్ అంటేనే ఆఫ్‌రోడింగ్ ప్రియులకు ప్రత్యేకమైన క్రేజ్. ఈ పాపులర్ 3-డోర్ ఎస్‌యూవీకి కంపెనీ ఇప్పుడు మరిన్ని అప్‌డేట్స్ అందించింది. Mahindra Thar OG పేరుతో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మెకానికల్, డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులు చేసిన ఈ కొత్త థార్ OG ప్రారంభ ధరను రూ.10.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. కొత్త లుక్‌తో థార్ OG థార్ OG ముందు భాగంలో కొత్త గ్రిల్‌ను […]

Mahindra Thar OG : మహీంద్రా థార్ అంటేనే ఆఫ్‌రోడింగ్ ప్రియులకు ప్రత్యేకమైన క్రేజ్. ఈ పాపులర్ 3-డోర్ ఎస్‌యూవీకి కంపెనీ ఇప్పుడు మరిన్ని అప్‌డేట్స్ అందించింది. Mahindra Thar OG పేరుతో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మెకానికల్, డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులు చేసిన ఈ కొత్త థార్ OG ప్రారంభ ధరను రూ.10.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.

కొత్త లుక్‌తో థార్ OG
థార్ OG ముందు భాగంలో కొత్త గ్రిల్‌ను ఏర్పాటు చేసి, దానిపై ‘Thar’ బ్యాడ్జింగ్ ఇచ్చారు. దీనికి ఇరువైపులా C-ఆకారపు DRLsతో కూడిన కొత్త LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఐస్-క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చాయి. ముందు, వెనుక బంపర్లను కూడా కొత్తగా డిజైన్ చేశారు.అలాగే, పాత మోడల్‌తో పోలిస్తే ట్రాక్ వెడల్పును పెంచారు. 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, LED టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు కూడా ఉన్నాయి. ఎక్కువ వేరియంట్లలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు లభిస్తాయి. రంగుల విషయానికి వస్తే Battleship Grey, Deep Forest, Everest White, Galaxy Grey, Stealth Black, Tango Red రంగులు కొనసాగుతుండగా.. Artemis Silver, Jeans Blue అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను జోడించారు.

Roxx ప్లాట్‌ఫామ్‌పై కొత్త థార్
Thar OGను మహీంద్రా M-GLYDE 4G ప్లాట్‌ఫామ్పై నిర్మించింది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను 5-డోర్ Thar Roxxలో కూడా ఉపయోగించారు. హై-స్ట్రెంగ్త్ స్టీల్ ఫ్రేమ్‌తో బాడీని తేలికగా, మరింత దృఢంగా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. వెనుక భాగంలో Pentalink సస్పెన్షన్‌తో Watt’s Linkను కూడా అందించారు. కొత్త DaVinci డ్యాంపర్లతో రైడ్ కంఫర్ట్‌ను మెరుగుపరిచారు.

మరింత పవర్‌ఫుల్ ఇంజిన్లు
Thar OGలో మూడు ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 117 BHP, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పవర్ 130 BHP నుంచి 150 BHPకు, టార్క్ 300 Nm నుంచి 330 Nmకు పెరిగింది. ఇక 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 BHP నుంచి 160 BHPకు, టార్క్ 300 Nm నుంచి 330 Nmకు పెరిగింది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఆఫ్‌రోడింగ్, సేఫ్టీ ఫీచర్లు
కొత్త థార్ OGలో తొలిసారిగా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ (EPS) అందించారు. 4X4 వెర్షన్లలో వెనుక యాక్సిల్‌కు Electronic Locking Differential (ELD) ఇచ్చారు. Mud, Sand, Snow అనే మూడు టెర్రైన్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ఆల్‌రౌండ్ డిస్క్ బ్రేకులు, అప్‌డేటెడ్ ESP సూట్, 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. ఇందులో ముందు రెండు, రెండు వరుసల్లో Head, Pelvis, Thorax, Shoulder రక్షణ కోసం HPTS ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

ఇంటీరియర్‌లోనూ మార్పులు
క్యాబిన్‌లో కొత్త Truffle Brown లెదరెట్ అప్‌హోల్స్టరీ అందించారు. రెండో వరుస ప్రయాణికుల కోసం కప్‌హోల్డర్లతో ఆర్మ్‌రెస్ట్‌ను కూడా జోడించారు. పాత మోడల్‌తో పోలిస్తే NVH (Noise, Vibration, Harshness) స్థాయులను తగ్గించినట్లు మహీంద్రా తెలిపింది.

Thar OG AXT, LXT, ZXT అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.10.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్). తాజా అప్‌డేట్స్‌తో 3-డోర్ థార్‌ను మరింత ఆధునికంగా, శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు మహీంద్రా పేర్కొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper