SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన ఘనత అతనికే దక్కింది. ఇప్పటి వరకు 12 సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఏకైక దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి రాజమౌళి తన కెరియర్ మొదట్లో దర్శకుడిగా మారకముందు వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు. ఇక ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా ‘అర్ధాంగి’ అనే సినిమాని స్టార్ట్ చేశారు. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి డైరెక్షన్ పనులన్నీ రాజమౌళినే చూసుకున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని రాజమౌళి చాలా ఆశలు పెట్టుకున్నప్పటికి ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.
ఇక ఈ సినిమాకి అఫీషియల్ గా విజయేంద్రప్రసాద్ దర్శకుడు అయినప్పటికి కొన్ని సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించారట
అందుకే తను గోస్ట్ డైరెక్టర్ గా పని చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆ తర్వాత రాజమౌళి ‘శాంతి నివాసం’ సీరియల్ చేసి సూపర్ సక్సెస్ సాధించాడు.
ఇక అప్పుడే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ప్రేక్షకులందరి హృదయాలను దోచుకున్నాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి ప్రస్థానం ఏ రేంజ్ లోకి వెళ్ళిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుని హీరోగా పెట్టి పామ్ వరల్డ్ లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు అంటే అతని స్థాయి ఎక్కడికి వెళ్లిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు రాబోయే సినిమాల కోసం రాజమౌళి విపరీతంగా కష్టపడి పోతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతానికైతే ‘వారణాసి’ సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ పెట్టాడు…ఇక ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినిమా స్థాయిని విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…








