Homeవింతలు-విశేషాలుFlying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర నిర్మాణం ఆ విధంగా ఉంటుంది. కాకపోతే పక్షుల మాదిరిగా ఎగిరే కలను మనిషి లోహవిహంగాలను తయారు చేయడం ద్వారా తీర్చుకున్నాడు. విమానాలు.. గ్లైడర్లు.. హెలికాప్టర్లు వంటివి మనిషిని ఆకాశంలో విహరించే విధంగా చేస్తున్నాయి.. ఒకవేళ ఇవేవీ లేకుంటే.. మనిషి ఆకాశంలో ఎగరడానికి ఆస్కారం […]

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర నిర్మాణం ఆ విధంగా ఉంటుంది. కాకపోతే పక్షుల మాదిరిగా ఎగిరే కలను మనిషి లోహవిహంగాలను తయారు చేయడం ద్వారా తీర్చుకున్నాడు.

విమానాలు.. గ్లైడర్లు.. హెలికాప్టర్లు వంటివి మనిషిని ఆకాశంలో విహరించే విధంగా చేస్తున్నాయి.. ఒకవేళ ఇవేవీ లేకుంటే.. మనిషి ఆకాశంలో ఎగరడానికి ఆస్కారం ఉంటుందా.. అది సాధ్యమవుతుందా.. పక్షుల మాదిరిగానే మనిషికి రెక్కలు ఉంటే ఎలా ఉంటుంది.. ఒకవేళ ఆ రెక్కలు ఉంటే ఎలా ఉండాలి. వాటి ఆకృతి ఏ విధంగా రూపుదిద్దుకోవాలి.. అనే అంశాల మీద ఇటీవల కొంతమంది పరిశోధకులు ఒక అంచనా వేశారు. అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ రెక్కలు గనుక మనిషికి వచ్చినప్పటికీ ఎగిరే అవకాశం ఉండదు. ఎందుకంటే అతడు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఒక నిర్ణీత బరువు ఉన్న వ్యక్తి గాలిలోకి ఎగరాలంటే రెక్కల విస్తీర్ణం 6 నుంచి ఏడు మీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ రెక్కలు ఉన్నంత మాత్రాన మనిషి ఎగిరే అవకాశం లేదు. దానికి సంబంధించిన మార్పులు కూడా అనుకూలంగా ఉండాలి. భారీగా ఉన్న రెక్కలను ఆడించాలి అంటే మనిషికి అంత ఈజీ కాదు. ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ చాతి భాగం కంటే ఎక్కువ స్థాయిలో కండరాల నిర్మాణం ఉండాలి.

మనిషికి స్వేచ్ఛగా ఆడించాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక లంగర్ లాంటి చాతి కండరాలు ఉండాలి. వాటికి అనుకూలంగా బలమైన కీలు ఎముకలు ఉండాలి. ఇవి చాతి మధ్య నుంచి.. కిందికి నేరుగా వచ్చినట్టు ఉండాలి. పక్షులతో పోల్చి చూస్తే మనుషుల ఎముకల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. బరువు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు ఆకాశంలో ఎగరాలంటే అవి అత్యంత తేలికగా ఉండాలి. లేనిపక్షంలో రెక్కలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆకాశంలో రెక్కలను ఆడించడానికి విపరీతంగా శక్తి అవసరం పడుతుంది. ఆక్సిజన్ సరఫరా కూడా మెరుగుపరిచేందుకు.. ఊపిరితిత్తులు.. గుండె అనుకూలంగా ఉండాలి. గాలిలో విహరిస్తున్నప్పుడు స్పృహ లోనే ఉండాలంటే ఆక్సిజన్ ట్యాంక్ లాంటి నిర్మాణం కచ్చితంగా ఉండాల్సిందే.

అందువల్లే మనుషులకు రెక్కల నిర్మాణం అనేది ఉండదు. అవతార్ సినిమాలో చూపించినట్టు.. ప్రత్యేకమైన జంతువులకు మాత్రమే రెక్కల నిర్మాణం ఉంటుంది. వాటి శరీర అవయవాల బరువుకు అనుకూలంగా రెక్కలు ఉంటాయి. అందువల్లనే అధికారులు స్వేచ్ఛగా విహరించగలుగుతాయి. మనిషిని శరీర నిర్మాణం చాలా భిన్నమైనది కాబట్టి రెక్కలు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆకాశంలో ఎగిరే అవకాశం అస్సలు లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper