spot_img
Homeఎంటర్టైన్మెంట్Raashi Khanna: టైట్ డ్రెస్ లో బెడ్ పై రాశి ఖన్నా... సోషల్ మీడియాను షేక్...

Raashi Khanna: టైట్ డ్రెస్ లో బెడ్ పై రాశి ఖన్నా… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్ లేడీ లేటెస్ట్ ఫోటోస్

Raashi Khanna: తెలుగులో రాశి ఖన్నా జోరు తగ్గింది. ఆమె హిందీ, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తుంది. ఆమె కెరీర్ కి పునాది పడింది మాత్రం టాలీవుడ్ లోనే. 2013లో రాశి ఖన్నా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. జాన్ అబ్రహం హీరోగా నటించిన మద్రాస్ కెఫే చిత్రంలో రాశి ఖన్నా (Raashi Khanna) హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ ఆమె అక్కినేని హీరోల మల్టీస్టారర్ మనం చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇక ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ స్టార్స్ తో నటించే ఛాన్స్ రాలేదు. రాశి ఖన్నా జతకట్టిన ఒకే ఒక స్టార్ హీరో ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ రోల్ చేసింది. తర్వాత మరో స్టార్ ఆమెను పట్టించుకోలేదు. 2019లో రాశి ఖన్నా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది.

ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలు హిట్ సొంతం చేసుకున్నాయి. ప్రతిరోజూ పండగే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అప్పుడే ఆమెకు నెగిటివ్ మూవీ పడింది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి ఖన్నా బోల్డ్ రోల్ చేసింది. విజయ్ దేవరకొండతో శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ మూవీ తనకు బూస్ట్ ఇస్తుంది అనుకుంటే… అసలుకే ఎసరు పెట్టింది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ళు రాశికి ఆఫర్స్ రాలేదు. దాంతో ఆమె కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

2022లో పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు చేసింది. అవి రెండు నిరాశపరిచాయి. ఇక్కడ ఆఫర్స్ రాకున్నా రాశి బిజీగానే ఉన్నారు. హిందీలో రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తుంది. అలాగే మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్ ఫ్యాన్స్ ఆమెను మర్చిపోకుండా సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా టైట్ డ్రెస్ ధరించి బెడ్ పై హాట్ లుక్స్ లో షాక్ ఇచ్చింది. రాశి ఖన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular