Homeఎంటర్టైన్మెంట్Naga Vamsi: నేనేమి 'సాగర సంగమం' తీయలేదు.. 'ఫంకీ' పై నిర్మాత నాగవంశీ హాట్...

Naga Vamsi: నేనేమి ‘సాగర సంగమం’ తీయలేదు.. ‘ఫంకీ’ పై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్

Naga Vamsi: ‘విశ్వక్ సేన్'(Vishwak Sen) హీరో గా నటించిన ‘ఫంకీ'(Funky Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ‘జాతి రత్నాలు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ KV నుండి వచ్చిన చిత్రమిది. ఈ సినిమాకు ముందు ఆయన ‘ప్రిన్స్’ అనే తమిళ చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, టీవీ, ఓటీటీ స్ట్రీమింగ్ లో మాత్రం […]

Naga Vamsi: ‘విశ్వక్ సేన్'(Vishwak Sen) హీరో గా నటించిన ‘ఫంకీ'(Funky Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ‘జాతి రత్నాలు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ KV నుండి వచ్చిన చిత్రమిది. ఈ సినిమాకు ముందు ఆయన ‘ప్రిన్స్’ అనే తమిళ చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, టీవీ, ఓటీటీ స్ట్రీమింగ్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అనుదీప్ కామెడీ అందరికీ కనెక్ట్ అయ్యే రకంగా ఉండదు కానీ, ఆయన కామెడీ ని ఇష్టపడే ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఒకటి ఉంది. వాళ్లకు ఈరోజు విడుదలైన ‘ఫంకీ’ చిత్రం పర్వాలేదు అనిపించింది, కానీ మిగిలిన వాళ్లకు మాత్రం ఇదేమి సిల్లీ స్టోరీ, చెత్తగా ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు.

అయితే నేడు ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని కాసేపటి క్రితమే ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో నాగవంశీ సోషల్ మీడియా లో వచ్చిన రివ్యూస్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు తెల్లవారు జామున ఓవర్సీస్ లో మొదటి షో పూర్తి అయ్యాక, ఆడియన్స్ నుండి ఈ చిత్రం పై ఫ్లో లేదు, సినిమా మొత్తం అతుకుల బొంత లాగా ఉంది, సన్నివేశాల కోసమే కథ రాసినట్టుగా ఉంది, ఇలా ఎన్నో రకాల రివ్యూస్ వచ్చాయి. విడుదలకు ముందు మేమే ఈ విషయాన్ని చెప్పాము కదా, మళ్లీ మీరేదో కొత్తగా కనుకున్నట్టు సైంటిస్ట్స్ లాగా చెప్తున్నారేంటి?. నేనేదో అద్భుతంగా సాగరసంగమం తీశానని చెప్పలేదు కదా, ఒక చిన్న సిల్లీ కామెడీ సినిమానే తీశాము, అనుదీప్ స్టైల్ లో వన్ లైన్ స్టోరీ అనే చెప్తూ వచ్చాము కదా’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పదం గా మారింది. నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నోటికి ఏది తోచితే అది మాట్లాడడం సరికాదు, రివ్యూయర్స్ మీద గతం లో ఇలా నోరు పారేసుకున్నావు, పోనిలే మీ సినిమాకు వాళ్ళు నష్టం చేస్తున్నారు కాబట్టి ఆవేదన తో అలా మాట్లాడి ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ సినిమా చూసొచ్చి రివ్యూస్ చెప్పిన ఆడియన్స్ మీద కూడా ఇలాగే సెటైర్ టోన్ తో మాట్లాడుతావా?, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆడియన్స్, వాళ్ళు లేకపోతే నువ్వు ఇంత దూరం వచ్చేవాడివా?, ఒకసారి ‘వార్ 2’ ఈవెంట్ లో ఇలాగే పొగరుగా మాట్లాడి తీవ్రమైన ట్రోల్స్ కి గురి అయ్యావు, ఈసారి ఇంకా పెద్దది ఎదో జరుగుతుంది నీకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper