Cult Movie: యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విశ్వక్ సేన్. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం యాక్టింగ్ టాలెంట్ తోనే కాకుండా, తన దర్శకత్వ ప్రతిభ తో కూడా శబాష్ అని నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఫలక్ నూమాదాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘కల్ట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ , అందులో హీరో గా కూడా నటించాడు. ఇండియా లో మొట్టమొదటి ‘స్లాషర్’ జానర్ లో తెరకెక్కిన సినిమా గా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో వేసారట.
మూవీ టీం తో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన బయ్యర్స్ కూడా ఈ ప్రివ్యూ షోలో పాల్గొన్నారట. దీనికి వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో ‘స్క్విడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ ని మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాని ఆ వెబ్ సిరీస్ ని ఆదర్శంగా తీసుకొని తీర్చిదిద్దినట్టు చెప్తున్నారు. కేవలం కాన్సెప్ట్ మాత్రమే ఆ సిరీస్ నుండి తీసుకున్నారని , కానీ సినిమా టేకింగ్ మాత్రం వేరే లెవెల్ లో డీల్ చేసారని అంటున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ అందించిన మాటలు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయట. సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టే విధంగా ఉండదట. అంతటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని నడిపించాడని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటుందట.
ఓవరాల్ విశ్వక్ సేన్ చాలా కాలం గ్యాప్ తర్వాత కమర్షియల్ గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఈ చిత్రం ద్వారా అందుకోబోతున్నాడని అంటున్నారు. ముఖ్యంగా వయొలెన్స్ సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉన్నాయని , ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతటి వయొలెన్స్ ని చూడలేదని అంటున్నారు. అంతే కాకుండా, ఈ వయొలెన్స్ లో కూడా ఒక మెసేజ్ ని జోడించే ప్రయత్నం చేసాడట విశ్వక్ సేన్. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని జెన్ జీ యూత్ ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని , ఈ ఏడాది టాలీవుడ్ కి మరో భారీ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. మరి విడుదల తర్వాత ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం పై మా అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.