Homeటాప్ స్టోరీస్Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు..

Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు..

Aadarsha Kutumbam: మిగతా ప్రజలను కాస్త పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా అభిమాన తారలు నటించే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మాణం అవుతున్నాయి. పైగా సినిమా నిర్మాణ సమయంలోనే అభిమానులు ఎగిరి గంతులు వేసే విధంగా మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇది మంచి పరిణామం.. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి […]

Aadarsha Kutumbam: మిగతా ప్రజలను కాస్త పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా అభిమాన తారలు నటించే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు గ్లోబల్ స్టాండర్డ్స్ తో నిర్మాణం అవుతున్నాయి. పైగా సినిమా నిర్మాణ సమయంలోనే అభిమానులు ఎగిరి గంతులు వేసే విధంగా మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఇది మంచి పరిణామం.. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి హీరోలు.. నిర్మాణ సంస్థలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇది మంచిదే అయినప్పటికీ.. విడుదల విషయంలో ప్రేక్షకుల సహనానికి మేకర్స్ పరీక్ష పెడుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాల విడుదల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ది ప్యారడైజ్ సినిమా విషయంలో అనేక రకాలుగా తేదీలు మారిపోయాయి. చివరికి ఇటీవల ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడేందుకు ప్రధాన కారణం రీ రికార్డింగ్.. ఇంకా కొన్ని రకాల చిత్రీకరణలు. వాస్తవానికి ఒక సినిమా సెట్స్ మీదికి వెళ్ళినప్పుడు కచ్చితంగా విడుదల విషయంలో నిర్మాతకు ఒక అంచనా ఉంటుంది. పైగా దర్శకుడు కూడా క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అదే లోపించింది. ఏదో ఒక పాయింట్ అనుకోవడం.. దాని చుట్టూ సినిమాను తీయడం తెలుగు పరిశ్రమలో పరిపాటిగా మారిపోయింది. బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు తీయడం నేటి కాలంలో తగ్గిపోయిందని పేరుపొందిన నిర్మాతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణకు బాలీవుడ్ లో ఒక సినిమా సెక్స్ మీదికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంచనా తో ఉంటారు. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేస్తూ ఉంటారు. పైగా మార్కెటింగ్ విషయంలో కూడా బాలీవుడ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ ఉంటుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో అది పూర్తిగా లోపించింది. హీరో అన్ని విభాగాలలో వేలు పెట్టడం.. కొన్ని సందర్భాలలో డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం.. నిర్మాతను ఇబ్బంది పెట్టడం.. పైగా క్రియేటివ్ క్లాసెస్ పేరుతో సినిమా నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతటి చిరంజీవి నటించిన విశ్వంభ సినిమా అనేక పర్యాయాలుగా వాయిదా పడుతూ వస్తోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో కూడా వాయిదాల పర్వం మరోసారి సాగింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు 2 తేదీలను మేకర్స్ ప్రకటించారు. పైగా సోషల్ మీడియా వేదికగా ఆ ప్రకటన చేశారు. కానీ మరోసారి వాయిదా వేస్తున్నామని చెప్పి ప్రేక్షకులను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఈ సినిమా విడుదల వాయిదా పడేందుకు ప్రధాన కారణం రీ రికార్డింగ్.. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయట.. అలాంటప్పుడు నిర్మాతలలో ఒకరైన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం ఎందుకు.. అభిమానులలో ఆశలు పెంచడం ఎందుకు.. ఆ తర్వాత సినిమాను వాయిదా వేస్తున్నామని చెప్పడమెందుకు.. ఇదంతా కూడా అభిమానుల సహనాన్ని పరీక్షించడం కాకపోతే మరొకటి కాదని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశం గనుక ఉండి ఉంటే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎందుకు చేపడతారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper