Homeఎంటర్టైన్మెంట్Mrunal Thakur: రేపు ధనుష్ తో తన పెళ్లి గురించి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికరమైన...

Mrunal Thakur: రేపు ధనుష్ తో తన పెళ్లి గురించి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!

Mrunal Thakur: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో తమిళ హీరో ధనుష్(Dhanush K Raja), హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, ఈ ఏడాది ఫిబ్రవరి 14 న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. రేపే ఫిబ్రవరి 14 , మరి మృణాల్ ధనుష్ ని పెళ్లాడబోతుందా లేదా అనే ప్రశ్నకు రీసెంట్ గా మృణాల్ స్టార్ ప్లస్ ఛానల్ లో […]

Mrunal Thakur: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో తమిళ హీరో ధనుష్(Dhanush K Raja), హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, ఈ ఏడాది ఫిబ్రవరి 14 న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. రేపే ఫిబ్రవరి 14 , మరి మృణాల్ ధనుష్ ని పెళ్లాడబోతుందా లేదా అనే ప్రశ్నకు రీసెంట్ గా మృణాల్ స్టార్ ప్లస్ ఛానల్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. ‘చాలా మంది నేను ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రచారం చేశారు. నేను రేపు ఎలాంటి పెళ్లి చేసుకోవడం లేదు. ఏప్రిల్ 1 న ఫూల్స్ డే. కానీ ఈ వార్తని నమ్మిన వాళ్ళు రేపు ఫూల్స్ కాబోతున్నారు. అసలు ఈ రూమర్ ని ఎవరు పుట్టించారో తెలియడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

అసలు ఈ రూమర్స్ ప్రారంభం అవ్వడానికి ప్రధాన కారణం, ధనుష్ హిందీ లో చేసిన ‘తేరే ఇష్క్ మెయిన్’ అనే సినిమానే. ఈ చిత్రం షూటింగ్ మొదలైన కొత్తల్లో, ఆ చిత్ర దర్శకుడు ఆనంద్ L రాయ్ ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో ఈ చిత్రానికి ఏ మాత్రం సంబంధం లేని మృణాల్ ఠాకూర్ కూడా కనిపించింది. ఆమె ధనుష్ తో క్లోజ్ గా ఉండడం చూసినప్పటి నుండి సోషల్ మీడియా లో ఈ ప్రచారం మొదలైంది. అప్పటి నుండి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ పుట్టించారు. అదే విధంగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్ కి కూడా ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన ఈవెంట్ లోకి అడుగుపెట్టగానే, డోర్ వద్దకు వెళ్లి, అతని చేతులు పట్టుకొని తీసుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

ఆ ఈవెంట్ లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళెవ్వరూ కూడా అలా ధనుష్ వద్దకు వెళ్ళలేదు. అలాంటిది మృణాల్ ఠాకూర్ వెళ్లిందంటే, కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో ఉండబట్టే కదా అనేది నెటిజెన్స్ అభిప్రాయం. అంతే కాకుండా వీళ్లిద్దరు హోటల్ లో ప్రైవేట్ గా ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఇవన్నీ చూసిన తర్వాత మృణాల్ ఠాకూర్ మన చెవుల్లో పూలు పెడుతుందేమో, కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా మృణాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కి ధనుష్ ని ఆహ్వానించింది నేను కాదు, అజయ్ దేవగన్ గారు అంటూ చెప్పుకొచ్చింది. మరి అలాంటప్పుడు ధనుష్ ఈవెంట్ కి వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి అజయ్ దేవగన్ వెళ్ళాలి కానీ, నువ్వెందుకు వెళ్ళావు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper