ENE 2 Trailer: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న చీరల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ , ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ బోర్ కొట్టినప్పుడల్లా ఈ చిత్రాన్ని వేసుకొని చూస్తుంటారు, అలాంటి రిపీట్ వేల్యూ ఉంది కాబట్టే , రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మొదటి రిలీజ్ లో వచ్చిన వసూళ్లకంటే రీ రిలీజ్ లో వచ్చిన వసూళ్లే ఎక్కువ. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా ‘ENE రిపీట్’ తెరకెక్కింది. ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి భాగం లో ఉన్నటువంటి సరదా , రెండవ భాగం లో కూడా ఉందని , స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూస్తే మంచి కిక్ ని ఇస్తుందని , వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమా తో మంచి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే , హీరో కి ఒక సినిమా తీయాలనే కోరిక మొదటి భాగం లో ఉండడం మనమంతా చూసే ఉంటాము. ఇప్పుడు రెండవ భాగం లో సినిమాని తీసే స్థాయికి ఎదుగుతాడు. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ని తీస్తున్న సమయం లో హీరో కి , అతని స్నేహితులకు ఎదురైనా సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది.
ఎలాంటి డ్రామా కి ఛాన్స్ ఇవ్వకుండా, సరదాగా సాగిపోయే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అడుగడుగునా వింటేజ్ తరుణ్ భాస్కర్ స్టైల్ మేకింగ్ లో కనిపించింది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగలదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.