Pawan Kalyan : ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో ఒక్క అవినీతి మచ్చ లేకుండా నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే..రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజలకు ఏకైక చాయిస్ అనే రేంజ్ లో రాజకీయాలను చేస్తున్నాడు..ఇది వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మన భారతదేశ రాజకీయ చరిత్రలో తన సొంత డబ్బులతో రైతులకు సహాయం చేయలేదు..అలాంటిది ప్రభుత్వం పట్టించుకోకపోతే నష్టపోయిన కౌలు రైతులను పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో 30 కోట్ల రూపాయిలు వెచ్చించి మరీ సహాయం చేసాడు.

మొన్న ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లను కూల్చివేస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా నష్టపోయిన ప్రతీ ఒక్క కుటుంబానికి లక్ష రూపాయిలు ఆర్ధిక సహాయం అందించి.. తనలోని గొప్ప మనసుని చాటుకున్నాడు.. ఇంత స్వచ్ఛమైన మనసుతో రాజకీయాలు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచాడు పవన్ కళ్యాణ్..అందుకే ఆయనని అభిమానులు ఆరాధ్యదైవం లాగా కొలుస్తారు.
తాజాగా ఒక జనసేన పార్టీ నాయకుడు ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన కళ్ళతో చూసిన ఒక నిజం చెప్పగా..అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు తాను సంపాదించిన డబ్బులను ప్రజలకు దానం చేసి..నిన్న టాక్సు కట్టడానికి 5 కోట్ల రూపాయిలు అప్పు చెయ్యడం నా కళ్ళతో చూసాను’ అని చెప్తాడు..ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు.
ఫేస్ బుక్ , ట్విట్టర్ , వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన ఈ వీడియో వైరల్ గా తిరుగుతోంది..పవన్ కళ్యాణ్ గొప్పతనం ఇలాంటిదా అని ఇతర హీరోల అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు..పవన్ కళ్యాణ్ నిజాయితీ తో కూడిన రాజకీయాలను ప్రజలు ఈసారైనా గుర్తిస్తారో లేదో చూడాలి..ప్రస్తుతానికి అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే పోతోంది.
https://twitter.com/Hidderkaran/status/1601129057239781376?s=20&t=dB8KDO1swhAk7BdpAE-tng