Vijay son Jason Sanjay : తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు జేసన్ సంజయ్ రీసెంట్ గానే సినీ రంగం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కొడుకు హీరో గానే ఎంట్రీ ఇవ్వడం ఇది వరకు ఆనవాయితీగా వస్తోంది. కానీ సంజయ్ మాత్రం రొటీన్ కి భిన్నంగా డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడానికి మొగ్గు చూపించాడు. అలా ఆయన దర్శత్వం లో తెరకెక్కిన చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరో గా నటించిన ఈ సినిమా , ఈ నెలలోనే గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ లో ఇంత టాలెంట్ ఉందని అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ , సంజయ్ పలు ఇంటర్వ్యూస్ ఇచ్చారు.
రీసెంట్ గానే ప్రముఖ యాంకర్ సుమ తో వీళ్లిద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. సుమ సంజయ్ కి ఒక నాలుగు తెలుగు డైలాగ్స్ ని నేర్పించాలని చిరంజీవి ఇంద్ర చిత్రం లోని ‘మొక్కేకదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ని సంజయ్ కి నేర్పించింది. ఆ తర్వాత మహేష్ బాబు పోకిరి లోని ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ ని , ప్రభాస్ మిర్చి చిత్రం లోని ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ ని సంజయ్ చేత పలికించింది యాంకర్ సుమ. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
సంజయ్ తెలుగు చాలా క్యూట్ గా ఉందని , ఒక సూపర్ స్టార్ , ముఖ్యమంత్రి కొడుకు ఇలా తమ అభిమాన హీరోల డైలాగ్స్ ని పలుకుతుంతే మామూలు కిక్ రావడం లేదంటూ కామెంట్స్ చేస్తూఇన్నారు నెటిజెన్స్. ఇక త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన తెలుగు లో మాట్లాడి , మన తెలుగు హీరోల గురించి నాలుగు ముత్తాతలు మాట్లాడితే చాలా బాగుంటుందని అంటున్నాడు నెటిజెన్స్. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.