SS Rajamouli : రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలో అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడు తొందరలోనే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వారణాసి సినిమా హాలీవుడ్ లో సైతం సందడి చేస్తుందనే విషయమైతే అక్కడి ప్రేక్షకులకు అర్థమైంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం భారీ ఎత్తున చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న తెలుగు సినిమా అంటూ ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి స్టాండర్డ్ సినిమా కాబట్టి ఈ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళికి అభిమానులుగా మారతారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన రాజమౌళి ప్రస్థానం ప్రపంచస్థాయి ప్రేక్షకుల వరకు చేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి 1600 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడు అతని సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడాలి. అలాంటప్పుడే సినిమా మీద పెట్టిన బడ్జెట్ రికవరీ అవ్వడమే కాకుండా భారీ లాభాలను కూడా సంపాదించడానికి అవకాశమైతే ఉంటుంది. కాబట్టి రాజమౌళి ఎలివేషన్ సీన్స్ ను అద్భుతంగా చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉంది. ఆ సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకుడికి బాగా నచ్చుతాయి.
వాటికి కనెక్ట్ అయిన ఆడియన్స్ సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమాలో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కో సన్నివేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారట…
కథ విషయంలో కూడా రాజమౌళి క్లారిటిగా ఉన్నాడు. ఇక మేకింగ్ విషయంలో కూడా రాజమౌళి క్లారిటీ గా ఉంటూ సినిమాను అద్భుతంగా చిత్రీకరిస్తూ ఈ ఒక్క విషయంలో క్లారిటి గా ఉంటే మాత్రం వారణాసి సినిమాని ఆపడం ఎవ్వరి వల్ల కాదు.
ఆ సినిమా దాదాపు 4000 కోట్ల వసూళ్లను ఈజీగా రాబడుతుందంటు సినిమా మేధావులు సైతం చాలా వరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.. ఏప్రిల్ 7, 2027 వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఆ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే…