Waltair Veerayya’ latest teaser : మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఎందుకంటే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి తన స్ట్రాంగ్ జోన్ అయిన ఊర మాస్ సబ్జెక్టు చెయ్యలేదు.. సీరియస్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వచ్చాడు.. దానికితోడు రీసెంట్ గా విడుదలైన రెండు సినిమాలు ఆయన రేంజ్ కి తగట్టుగా ఆడలేదు.

అందుకే మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ మూవీ పైన భారీ ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన చిరంజీవి ఇంట్రడక్షన్ టీజర్ తోపాటు బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..సినిమా మీద అంచనాలను పెంచింది..ఇప్పుడు డిసెంబర్ 12 వ తేదీన మాస్ మహారాజ రవితేజ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు..ఈ టీజర్ కి సంబంధించిన మాస్ పోస్టర్ ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.
ఈ పోస్టర్ లో రవితేజ ఒక చేతిలో కుక్కపిల్లని పట్టుకొని, మరోచేతిలో గొడ్డలిని గ్యాస్ సిలిండర్ కి తగిలించుకొని ఈడ్చుకుంటూ రావడాన్ని చూస్తుంటే డైరెక్టర్ బాబీ ఏదో గట్టిగా ప్లాన్ చేసాడు అనిపిస్తోంది.. ఈ టీజర్ రవితేజ కెరీర్ లోనే బెస్ట్ గా నిలవబోతుంది అట..విక్రమార్కుడు , ఇడియట్ సినిమాల్లో ఎలాంటి రవితేజ ని చూసామో..అలాంటి రవితేజ ని ఈ సినిమాలో చూపించబోతున్నామని ఈ టీజర్ ద్వారా అందరికి అర్థమైపోతుందట..
డిసెంబర్ 12 వ తేదీ.. సోమవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కాబోతుంది.. ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా..మెగాస్టార్ చిరంజీవికి సవతి సోదరుడిగా నటించబోతున్నాడు.. సినిమా ప్రథమార్థం మొత్తం వీళ్లిద్దరి మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంటుందట..ఆ తర్వాత ఇద్దరు కలిసిపోతారు..డైరెక్టర్ బాబీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీసుకొని తెరకెక్కించాడు..జనవరి 13 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.