Allari Naresh : అల్లరి నరేష్ కామెడీ జానర్ సినిమాలకు ఒకప్పుడు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సూపర్ హిట్ సినిమాల్లో పాపులర్ సన్నివేశాలను స్పూఫ్ చేసి కామెడీ పుట్టించాలంటే అల్లరి నరేష్ తర్వాతే ఎవరైనా. అయితే ఈమధ్య కాలం లో అల్లరి నరేష్ కామెడీ సినిమాలను పక్కన పెట్టి , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అవి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి రెండు హిట్ సినిమాలు పడ్డాయి కానీ , ఒకప్పటి పూర్వ వైభవం మాత్రం రావడం లేదు. ఇది ఆయన్ని ఇష్టపడే వాళ్లకు బాగా బాధని కలిగించే విషయం. అయితే ఇది అల్లరి నరేష్ అర్థం చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ , మళ్లీ తన ఓల్డ్ స్కూల్ కి వచ్చేశాడు.
రీసెంట్ గా ఆయన ‘రంభ ఊర్వశి మేనకా’ అనే చిత్రం చేశాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ టీజర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ టీజర్ లో అల్లరి నరేష్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం లోని ‘వాషి ఓ వాషీ’ డైలాగ్ ని అనుకరిస్తాడట. అది చాలా ఫన్నీ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రేంజ్ లో వచ్చిందని. టీజర్ విడుదలైన తర్వాత ఈ షాట్ బాగా వైరల్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. ఇది ఫన్నీ గా ఇమిటేట్ చేసినట్టు ఉంటే ఓకే , అలా కాకుండా కించపర్చినట్టు ఉంటే మాత్రం పవన్ ఫ్యాన్స్ పెద్ద రచ్చ చేసే అవకాశం ఉంది.
ఎందుకంటే లేటెస్ట్ గా ‘కొరియన్ కనకరాజు’ మూవీ లో సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేసిన సన్నివేశం ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ అంశం పై సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు , అందుకు మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా అలాంటి రచ్చకి తెర లేపకుండా ఉంటే చాలు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రేపు పవన్ ఫ్యాన్స్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తుంది అనేది.