Pawan Kalyan Anger Against Nagababu: తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. ఏ నలుగురు కూర్చొని మాట్లాడినా దీని గురించే చర్చ నడుస్తోంది. జంతువుల కొవ్వు కలవలేదని వైసీపీ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. తద్వారా అసలు లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించలేదు అనే వాదనను జనాల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తోంది. కానీ సిట్ ఇచ్చిన నివేదిక ని కూటమి నాయకులూ ప్రతీ అంశం చదువుతూ జనాలకు వివరిస్తున్నారు. ఒక్క చుక్క పాలు లేకుండా, కెమికల్స్ తో చేసిన లడ్డూలను వైసీపీ ప్రభుత్వం 20 కోట్ల మంది జనాలకు పంచింది అంటూ సిట్ ఇచ్చిన నివేదిక ని జనాల ముందు ఇచ్చింది. అదే విధంగా జంతువుల కొవ్వు కూడా కలిసినట్టు NDDB ఇచ్చిన రిపోర్టు ని కూడా జనాలకు చూపించింది.
ఈ అంశం పై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు, అదే విధంగా క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాస్తవాలను తెలిపేందుకు ప్రయత్నం చేశారు. అన్నీ ప్రాంతాల్లోనూ వైసీపీ దుష్ప్రచారాలు టిప్పు కొడుతూ, సిట్ ఇచ్చిన నివేదిక తో బ్యానర్లు కూడా వేశారు. కానీ జనసేన పార్టీ ముఖ్య నాయకుల నుండి మాత్రం ఈ అంశం పై ఎలాంటి స్పందన లేదు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ నిన్న తన పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసి, సమావేశం మధ్యలోనే వాకౌట్ చేసాడు. ఈ సమావేశం లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు పై కూడా ఫైర్ అయ్యినట్టు తెలుస్తోంది. శివాజీ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా మీరు పది నిమిషాల నిడివి కి పైగా వీడియో ద్వారా స్పందించారు, కానీ కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీసే విధంగా వైసీపీ చేస్తున్న వికృత చర్యలను ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీసినట్టు సమాచారం.
అవసరమైన విషయాలపై ఈమధ్య కాలం లో మన పార్టీ నేతల స్పందన అసలు లేదు. అన్నిటికీ నేనే ముందుకొచ్చి మాట్లాడాలంటే మీరంతా ఉన్నది ఎందుకు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు పార్టీ నేతల నుండి మౌనం తప్ప మరో రెస్పాన్స్ లేదు. నాగబాబు కూడా ఏమి మాట్లాడకుండా అలా చూస్తుండిపోయాడట. సోషల్ మీడియా లో అభిమానులు కూడా నాగబాబు పై మండిపడ్డారు. పనికిమాలిన విషయాలపై స్పందిస్తూ, పార్టీ కి చెడ్డ పేరు తీసుకొని రావడం కాదు, పవిత్రమైన తిరుమల లడ్డు విషయం లో వైసీపీ ఆడుతున్న వికృత చేష్టలను చూసి మీకు అసలు కోపం రావడం లేదా?, అసలు ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ నాగబాబు ని నిలదీస్తున్నారు.
అమ్మాయిల #వస్త్రధారణ పైన ,సోషల్ మీడియా లో మాట్లాడుతున్న నాగబాబు @NagaBabuOffl తిరుమల లడ్డు కల్తీ పై ఎందుకు మాట్లాడటం లేదని జనసేన మిగిలిన నాయకుల తో పాటు తన అన్న మీద కూడా అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ @PawanKalyan ..
నిజమే కదా వైసీపీ వాళ్లు లడ్డు కల్తీ జరిగిన విషయం నిజమేనని… pic.twitter.com/jKIzLLxMag
— మన ప్రకాశం (@mana_Prakasam) February 3, 2026