Homeఎంటర్టైన్మెంట్Dil Raju: దిల్ రాజు ని ఏకాకి చేసిన నిర్మాతలు..నైజాం నవాబ్ కి చేతిలో ఒక్క...

Dil Raju: దిల్ రాజు ని ఏకాకి చేసిన నిర్మాతలు..నైజాం నవాబ్ కి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు!

Dil Raju: దిల్ రాజు(Dil Raju) కి టాలీవుడ్ లో గడ్డు కాలం మొదలైందా..?, నిర్మాతగా మిగిలిన ప్రొడక్షన్ హౌసెస్ తో పోలిస్తే, దిల్ రాజు వద్ద ఎలాంటి పెద్ద పాన్ ఇండియన్ సినిమా లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ మినహా, మిగిలిన స్టార్ హీరోల డేట్స్ ఎవ్వరివీ కూడా ఇప్పుడు అతని వద్ద లేవు. ‘గేమ్ చేంజర్’ కొట్టిన దెబ్బ నుండి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరట కలిగించినా, పూర్తి స్థాయి నష్టాలు మాత్రం పూడవలేదు. […]

Dil Raju: దిల్ రాజు(Dil Raju) కి టాలీవుడ్ లో గడ్డు కాలం మొదలైందా..?, నిర్మాతగా మిగిలిన ప్రొడక్షన్ హౌసెస్ తో పోలిస్తే, దిల్ రాజు వద్ద ఎలాంటి పెద్ద పాన్ ఇండియన్ సినిమా లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ మినహా, మిగిలిన స్టార్ హీరోల డేట్స్ ఎవ్వరివీ కూడా ఇప్పుడు అతని వద్ద లేవు. ‘గేమ్ చేంజర్’ కొట్టిన దెబ్బ నుండి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరట కలిగించినా, పూర్తి స్థాయి నష్టాలు మాత్రం పూడవలేదు. చిన్న సినిమాలు తప్ప, పెద్ద సినిమాలు ఒక్కటి కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లో లేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఉన్నాయి, కానీ ఆయన ఉన్న బిజీ కి ఎప్పుడు ఆ డేట్స్ ని కేటాయిస్తాడో ఎవరికీ తెలియదు. నిర్మాతగా ఆయన పరిస్థితి ఇలా ఉంటే, కనీసం డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.

ఈ ఏడాది విడుదల అవ్వబోయే ఒక్క క్రేజీ చిత్రం కూడా దిల్ రాజు చేతుల్లో లేదు. ఎన్నో ఏళ్ళ నుండి తమ సంస్థకు నైజాం ప్రాంతం థియేట్రికల్ రైట్స్ ని ఇస్తూ వచ్చిన నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఇప్పుడు దిల్ రాజు తో కటీఫ్ చేసుకుంది. కారణం అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం వల్లే. ఇక నుండి సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కే ప్రతీ సినిమా నైజాం ప్రాంతం హక్కులు అన్నపూర్ణ స్టూడియోస్ కే వెళ్తుంది. ఇలా దిల్ రాజు ని లాక్ చేసేసారు అక్కడి టాప్ నిర్మాతలు. ఇది ఇలా ఉండగా క్రేజీ డబ్బింగ్ చిత్రాలను నిన్న మొన్నటి వరకు దిల్ రాజు నైజాం ప్రాంతం లో ఒడిసి పట్టుకునే వాడు. కానీ ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల రైట్స్ ని దక్కించుకోవడం లో కూడా బాగా వెనకబడ్డాడు.

గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ చిత్రం సీక్వెల్ ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ మార్చి 19న తెలుగు భాషలో కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుందట. భారీ లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు KGF చాప్టర్ 2 రేంజ్ హైప్ ఏర్పడింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper