Bigg Boss Telugu 10 : సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. మంచి కంటెంట్ ద్వారా చాలామంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అవుతుంటే.. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అవుతున్నవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారి వల్లే సామాజిక మాధ్యమాలు చూడాలంటేనే భయం వేస్తుంది.
అప్పట్లో టిక్ టాక్ వచ్చినప్పుడు ఉప్పల్ బాలు అనే వ్యక్తి తెగ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఆ యాప్ మనదేశంలో బ్యాన్ అయింది. దీంతో మిగతా సోషల్ మీడియా సంస్థలు షార్ట్స్.. రీల్స్ అనే సౌలభ్యాలను తీసుకొచ్చాయి. ఇక అప్పటినుంచి ఉప్పల్ బాలు పనికిమాలిన రీల్స్ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటికి విపరీతంగా లైక్స్, షేర్స్ రావడం జరిగిపోతోంది. ఉప్పల్ బాలు తోపాటు వైజాగ్ సత్య అనే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఇతడిదంతా చిత్రమైన వ్యవహార శైలి. చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. కుర్తా పైజామా ధరిస్తుంటాడు. తనను తాను గొప్ప సోషల్ మీడియా స్టార్ గా పేర్కొంటాడు. తాను మాత్రమే అందగాడినని చెప్పుకుంటాడు.
ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోగోలను పట్టుకొని వైజాగ్ సత్య తెరమీదకి చిత్రమైన డిమాండ్ తీసుకువచ్చాడు. ఉప్పల్ బాలును బిగ్ బాస్ సీజన్ 10 లోకి తీసుకోవాలట. పైగా ఉప్పల్ బాలు నాగార్జునకు ప్రతిరోజు బాడీ మసాజ్ చేస్తూ ఉంటాడట. ఆ రీజన్ వల్లే అతడిని బిగ్ బాస్ సీజన్ 10 లోకి తీసుకోవాలట. బిగ్బాస్ కార్యక్రమానికి విపరీతమైన పోటీ ఉంటుంది. ఇందులో కంటెస్టెంట్లు గా ఉండాలని చాలామంది పోటీ పడుతూ ఉంటారు.. ఆ పోటీ తట్టుకోలేక కొత్త కొత్త టెస్టులు షురూ చేసింది. ఇలా అనేక రకాల పరీక్షల తర్వాత బిగ్ బాస్ లోకి తీసుకుంటారు. ఈ విషయం వైజాగ్ సత్యకు తెలియక కాదు. కాకపోతే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఉప్పల్ బాలును తెరపైకి తీసుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఆ విషయం వైజాగ్ సత్యకు తెలిసినప్పటికీ ఇలా మాట్లాడటం.. అందులోకి నాగార్జునను లాగడం విశేషం.
వైజాగ్ సత్య మాట్లాడిన మాటలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో నాగార్జున అభిమానులు అతడిని గట్టిగా వేసుకుంటున్నారు. ఒరేయ్ నువ్వు ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళావా.. బిగ్ బాస్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా.. అందులోకి వెళ్లాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో నీకు తెలుసా.. అంటూ నాగార్జున అభిమానులు వైజాగ్ సత్య మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.