Homeలైఫ్ స్టైల్Salt Beliefs: ఉప్పు చేతికి ఇవ్వొద్దా..? ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయా?

Salt Beliefs: ఉప్పు చేతికి ఇవ్వొద్దా..? ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయా?

Salt Beliefs: భారతీయ సంస్కృతిలో ఉప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పును వంటల్లో రుచిని కలిగినే పదార్థంగా మాత్రమే కాకుండా.. ఐశ్వర్యానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఉప్పుకు సంబంధించిన అనేక ఆచారాలు, నమ్మకాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. కొందరు పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు చెబుతున్న ప్రకారం.. ఉప్పు నిప్పు కలవొద్దని అంటుంటారు. అలాగే ఉప్పును చేతికి ఇవ్వొద్దు అని, ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయని చెబుతుంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు? వీటి వెనక ఉన్న ఆధ్యాత్మిక […]

Salt Beliefs: భారతీయ సంస్కృతిలో ఉప్పుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పును వంటల్లో రుచిని కలిగినే పదార్థంగా మాత్రమే కాకుండా.. ఐశ్వర్యానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఉప్పుకు సంబంధించిన అనేక ఆచారాలు, నమ్మకాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. కొందరు పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు చెబుతున్న ప్రకారం.. ఉప్పు నిప్పు కలవొద్దని అంటుంటారు. అలాగే ఉప్పును చేతికి ఇవ్వొద్దు అని, ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయని చెబుతుంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు? వీటి వెనక ఉన్న ఆధ్యాత్మిక కారణాలేంటి?

ఉప్పు చేతికి ఇవ్వొద్దా?
పూర్వకాలంలో ఉప్పును నేరుగా ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి ఇవ్వడం మంచిది కాదని భావించేవారు. దానికి ఆధ్యాత్మికవాదులు చెబుతున్నదేంటంటే.. వేద సంప్రదాయంలో మన అరచేతిని అగ్నిస్థానంగా పేర్కొంటారు. పూజలు, దానాలు, తీర్థప్రసాదం స్వీకరించే సమయంలో కూడా అరచేతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల అగ్ని, లక్ష్మీ తత్వాలు వేరువేరు. ఈ తత్వాలు నేరుగా కలవకూడదనే సంకేతంగా ఉప్పును చేతిలో ఇవ్వకూడదని ఒక విశ్వాసం ఏర్పడింది.అంతేకాకుండా ఉప్పును అగ్నిలో వేస్తే చిటపట సౌండ్ వస్తుంది. అలాగే ఒకరు ఉప్పును మరో చేతికి ఇవ్వడం వల్ల ఆ ఇద్దరి మధ్య తగాదాలు ఉంటాయని అంటుంటారు.

ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయా?
ఉప్పు అడిగితే అప్పులు పెరుగుతాయి .. అనే నమ్మకం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. ఉప్పు ఇంటి ఐశ్వర్యానికి సంకేతమని భావిస్తారు. తరచూ ఇతరుల వద్ద నుంచి ఉప్పు తీసుకోవడం అంటే అవసరాల కోసం ఇతరులపై ఆధారపడటం అనే భావనకు ప్రతీకగా దీన్ని చూశారు. అదే భావన క్రమంగా అప్పులు పెరుగుతాయి అనే నమ్మకంగా మారిందని అంటారు.

పూర్వకాలంలో ఉప్పు విలువైన వస్తువుగా ఉండేది. ప్రతి ఇంట్లో సులభంగా లభించే పదార్థం కాదు. అందువల్ల దానిని జాగ్రత్తగా వినియోగించాలని, అవసరం లేకుండా ఇతరుల వద్ద అడగకూడదని పెద్దలు సూచించేవారు. అలాగే చేతిలో చేతికి ఇస్తే ఉప్పు కింద పడే అవకాశం ఎక్కువగా ఉండేది. వృథా కాకుండా ఉండేందుకు కూడా పాత్రలో ఇచ్చే అలవాటు ఏర్పడిందని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper