Prabhas Kalki: ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే అన్నీ కుదిరితే ఈ సినిమా ఈరోజే అంటే మే 9 న రిలీజ్ అయ్యేది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి మరో 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఈ సినిమా హైప్ ని మరింత పెంచాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ గా నిలవాలంటే ఈ సినిమాను చూడటానికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా థియేటర్ కి రావాలి అనే కుతూహలాన్ని అతనిలో కలిగించాలి.
అలా అయితేనే ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా మారడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ అది వచ్చి చాలా రోజులవుతుంది. కాబట్టి సినిమా నుంచి మరొక హై మూమెంట్ ని ఇస్తేనే ప్రేక్షకులకి ఈ సినిమా మీద మరోసారి బజ్ అయితే ఏర్పడుతుంది. అలాగే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని చూడడం కోసం ఎదురు చూసేంతలా వాళ్లని మెస్మరైజ్ చేయాలి. అలాంటప్పుడే వాళ్లు సినిమా చూడడానికి థియేటర్ కి వస్తారు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ లుక్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇక దాంతో పాటుగా అమితాబ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది కూడా సినిమాలో చాలా కీలకమైన పాత్రగా కనిపిస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను గాని లేదంటే గింప్స్ రూపంలో మరొక వీడియోను గాని వదిలితేనే ఈ సినిమా ప్రమోషన్ అనేది తారాస్థాయికి వెళ్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా మారడానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.
కాబట్టి అంతటి భారీ వసూళ్లను రాబట్టాలి అంటే సాధారణమైన విషయం కాదు. మినిమం 1000 కోట్లకు పైన రాబడితేనే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ జోన్ లో ఉంటారు. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది… ఇక ఎలక్షన్స్ ఫీవర్ ముగిసిన తర్వాత అయినా ఈ సినిమాకి సంబంధించిన భారీ ఎత్తున నిర్వహిస్తేనే సినిమాకి మంచి బజ్ వస్తుంది…