Homeఎంటర్టైన్మెంట్Nara Rohith: 'ఆదర్శ కుటుంబం' నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ , ఆడియన్స్ , ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి సరైన సీజన్ లో విడుదల చేస్తే, విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో 300 కోట్ల గ్రాస్ సినిమా వస్తుందని అంటున్నారు ట్రేడ్ […]

Nara Rohith: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ , ఆడియన్స్ , ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి సరైన సీజన్ లో విడుదల చేస్తే, విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో 300 కోట్ల గ్రాస్ సినిమా వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోనే విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, నారా రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే ఇప్పటికే ఒక వార్త సోషల్ మీడియా లో బాగా ప్రచారమైంది.

నేను నారా రోహిత్ పుట్టినరోజు కావడం తో , ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్ గా నోట్లో సిగరెట్ పెట్టుకొని , చాలా స్టైలిష్ యాటిట్యూడ్ తో ఈ పోస్టర్ లో కనిపించారు నారా రోహిత్. చూస్తుంటే ఆయన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయే పాత్ర దొరికినట్టుగా అనిపిస్తోంది. ఈ పాత్ర క్లిక్ అయితే , నారా రోహిత్ కి ఇలాంటి పాత్రలు ఎన్నో భవిష్యత్తులో రావొచ్చు. తన ప్రతీ సినిమాతో భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ , ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు నారా రోహిత్. కానీ ఈయన కెరీర్ లో కమర్షియల్ హిట్స్ చాలా తక్కువ. ప్రస్తుత తరానికి దగ్గరవడానికి కేవలం హీరో పాత్రలే చేయాల్సిన అవసరం లేదు.

పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా క్యారెక్టర్ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి క్షణం కూడా ఆలోచించని రోజులివి. అలాంటిది నారా రోహిత్ ఇలాంటి పాత్రలు చేయడం వల్ల , ఆయనకు కెరీర్ కి ప్లస్ అవ్వడమే కానీ , మైనస్ అవ్వడం వంటివి జరగదు. కాబట్టి , ఆయన కెరీర్ ని మలుపు తిప్పే పాత్రగా ఇది కచ్చితంగా నిలుస్తుందని నమ్మొచ్చు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. మరి అప్పటి లోపు పూర్తి అవుతుందో లేదో చూడాలి. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి నారా రోహిత్ ఫస్ట్ లుక్ ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper