Adarsha Kutumbam:వాయిదా పడుతూ వస్తున్న ఆదర్శ కుటుంబం మొత్తానికి విడుదలవుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడింది ఈ సినిమా. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల మల్లారెడ్డి కాలేజీలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. గతంలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేశారు. కాబట్టి చిత్ర యూనిట్ కొత్తగా మళ్లీ ప్రమోషన్ చేయడం లేదు.
కాకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఆమె నర్మగర్భంగా పంచుకున్నారు. ఆదర్శకుటుంబ సినిమాకు మొదటి నుంచి కూడా కొంతమంది అభిమానులు బ్లాస్ట్ సినిమాతో పోలికలు తీసుకొస్తున్నారు. బ్లాస్ట్ సినిమాలో అభిరామి.. యాక్షన్ కింగ్ అర్జున్.. ప్రీతి ముకుందన్ నటించారు. ఈ సినిమా అంచనాలు లేకుండా విడుదలై.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇటీవల ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాస్ట్ సినిమాతో పోల్చుతున్నారు అభిమానులు. పైగా షుగర్ కోటేడ్ లాగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని విమర్శకులు అంటున్నారు అయితే దీనిపై కథానాయక శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చారు. బ్లాస్ట్ సినిమాను తాను చూశానని.. అయితే ఆదర్శ కుటుంబానికి, దానికి సంబంధాలు లేవని చెప్పింది.. బ్లాస్ట్ మాత్రమే కాదు టూరిస్ట్ ఫ్యామిలీ.. దృశ్యం వంటి సినిమాలతో కూడా కొంతమంది పోల్చి చెబుతున్నారని.. అసలు ఆదర్శ కుటుంబం దానితో కంపేర్ చేస్తే విభిన్నంగా ఉంటుందని శ్రీనిధి స్పష్టం చేసింది.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు ఈ సినిమా కొత్తగా ఉంటుందని.. అభిమానులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది.” చాలాకాలం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాను. అనుకోకుండా ఆయన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. ఆచార్యంగా అనిపించింది. త్రివిక్రమ్ తీసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది అని” శ్రీనిధి వివరించింది. మరోవైపు శ్రీ నిధికి ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలి. ఎందుకంటే తెలుసు కదా ఫ్లాప్ అయింది. అంతకంటే ముందు కేజిఎఫ్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు గొప్పగా ఆడక పోవడంతో శ్రీనిధి కెరియర్ అంత గొప్పగా లేదు. ఈ సినిమా హిట్ అయితేనే ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి.