Homeఎంటర్టైన్మెంట్Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్ ఆవేదన..

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు సినీ ఇండస్ట్రీ లోకి పంపడానికి భయపడుతుంటారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ లో అమ్మాయిల పట్ల జరిగే వ్యవహారాలను గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నారు కాబట్టి. క్యాస్టింగ్ కౌచ్ అంశం పై వాళ్లలో తీవ్రమైన అభద్రతా భావం ఉండడం వల్లే , అమ్మాయిలను సినీ రంగం లోకి […]

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు సినీ ఇండస్ట్రీ లోకి పంపడానికి భయపడుతుంటారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ లో అమ్మాయిల పట్ల జరిగే వ్యవహారాలను గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నారు కాబట్టి. క్యాస్టింగ్ కౌచ్ అంశం పై వాళ్లలో తీవ్రమైన అభద్రతా భావం ఉండడం వల్లే , అమ్మాయిలను సినీ రంగం లోకి పంపేందుకు భయపడుతుంటారు. అయితే రీసెంట్ గా ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడిన మాటలను చూస్తుంటే , అమ్మాయిల తల్లిదండ్రులు సినీ ఇండస్ట్రీ లోకి పంపేందుకు ఎందుకు అంతలా భయపడుతున్నారో అర్థం అవుతుంది. కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వస్తే , ఇక ఏ ధైర్యం తో తల్లిదండ్రులు తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్లని ఇండస్ట్రీ కి పంపగలరు చెప్పండి.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమధ్యనే జరిగిన ఒక సినిమా షూటింగ్ లో కాజల్ అగర్వాల్ తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ కొన్ని రోజుల క్రితమే ఒక సినిమాలో నేను హీరోయిన్ గా నటించాను. షూటింగ్ మొదటి రోజు ప్యాకప్ అయ్యాక నా క్యార వ్యాన్ లోకి వెళ్లి కూర్చున్నాను. అలా కూర్చున్న కొద్దిసేపటికే అసిస్టెంట్ డైరెక్టర్ క్యార వ్యాన్ లోకి నా అనుమతి లేకుండా ప్రవేశించాడు. వెంటనే తన చొక్కా విప్పి , తన ఛాతీపై ఉన్న నా పేరు ని చూపించాడు. నాకు నోటి నుండి మాట రాలేదు , ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. అభిమానుల ప్రేమ పొందడం మా అదృష్టం , ఇలాంటివి చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ అనుమతి లేకుండా ప్రవేశించడం ఎంత వరకు కరెక్ట్. అలా ఒక్కసారిగా లోపలకు ప్రవేశించి , అతను చొక్కా విప్పడం తో ఏమి జరుగుతుందో అర్థం కాక వణికిపోయాను’.

‘తర్వాత అతన్ని పిలిచి , చాలా ప్రశాంతంగా మాట్లాడాను, ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు అంటూ వార్ణింగ్ ఇచ్చాను. ఇన్నేళ్ల నా సుదీర్ఘ సినీ ప్రయాణం లో ఇలాంటి షాకింగ్ సంఘటన ఎప్పుడూ జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు , కేవలం ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తన అభిమానాన్ని చూపించడానికి లోపలకు ప్రవేశించాడు. అయితే ఒక సూపర్ స్టార్ రేంజ్ ఉన్నటువంటి హీరోయిన్ ఉన్న క్యార వ్యాన్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా అతనికి ప్రవేశించే స్వేచ్ఛ ఎలా వచ్చింది?, ఇతను మంచోడు కాబట్టి పర్వాలేదు, అదే చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తి లోపలకు ప్రవేశించి ఉండుంటే ఎవరు బాధ్యత వహిస్తారు. అంత పెద్ద హీరోయిన్ కే సెక్యూరిటీ లేకపోతే , ఇక సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీ లో ?, ఇలాంటివి సినీ ఇండస్ట్రీ కి తమ పిల్లల్ని పంపాలా వద్ద అని ఆలోచించే తల్లిదండ్రులకు తెలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper