Homeఎంటర్టైన్మెంట్Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో ఉన్నాడని , వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గానే వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అంటూ వార్తలు రావడం , […]

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో ఉన్నాడని , వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గానే వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అంటూ వార్తలు రావడం , అందుకు తగ్గట్టుగానే అనుపమ పరమేశ్వరన్ పేరు ప్రస్తావించకుండా, బ్రేకప్ వ్యవహారం గురించి పోస్టులు వేయడం పెద్ద సంచలనం గా మారింది. ఈ టాపిక్ గురించి ఇప్పటికీ చర్చలు నడుస్తున్న సమయం లో, ధృవ్ విక్రమ్ మరో వివాదం లో చిక్కుకున్నారు. కోటి రూపాయలకు పైగా ఆయన మోసం చేసారంటూ నిర్మాతలు ఛాంబర్ లో అతని ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి ధృవ్ విక్రమ్ ఒప్పుకున్నారట. ఇందుకోసం ఆయన నిర్మాతల వద్ద కోటి రూపాయిల అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. ఈ సినిమా కోసం భారీగా సెట్లు వేసి , పాటల చిత్రీకరణ కోసం కూడా అధికంగా ఖర్చు చేశామని , కానీ ధృవ్ విక్రమ్ మాకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కరణ్ దర్శకత్వం ‘DV4’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని, ఇక్క అంతా రెడీ చేసుకొని , షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని ఆయన మోసం చేసారని , ఒప్పందాన్ని ఉల్లంఘించారు అంటూ ధృవ్ విక్రమ్ పై ఫిలిం ఛాంబర్ లో నీలాద్రి ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ ఫిర్యాదు చేశారు.

ఒప్పందం ప్రకారం ‘DV4’ కంటే ముందుగా రమేష్ వర్మ తో సినిమా చెయ్యాలి. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చెయ్యాలి. కానీ ధృవ్ విక్రమ్ ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని పూర్తి చేసిన తర్వాతే, రమేష్ వర్మ ప్రాజెక్ట్ చేస్తానని అంటున్నాడట. అందుకే నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చెయ్యాలని కోరుతూ ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిర్మాతల వర్షన్, కానీ జనాలు ఎవరు తప్పు ఉంది అనేది డిసైడ్ అవ్వడానికి , ధృవ్ విక్రమ్ వెర్షన్ కూడా వినాల్సి ఉంటుంది. కానీ సోషల్ మీడియా లో ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ కూడా ధృవ్ విక్రమ్ ఈ వ్యవహారం పై స్పందించలేదు. ఆయన స్పందిస్తే తప్ప, ఈ అంశం పై క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper