Victory Venkatesh: ఇద్దరు బలమైన హీరోలు.. బలమైన నేపథ్యాలు.. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయి.. కనుసైగ చేస్తే చాలు ఏవైనా సరే కాళ్ళ ముందుకు వచ్చి పడిపోతాయి. కళ్ళముందు వాలిపోతాయి. అటువంటి ఇద్దరు హీరోలు రంగంలోకి దిగితే.. ఒకరికి పోటీగా మరొకరు నిలబడితే.. అప్పుడు ఎలా ఉంటుంది.. పోటీ రసవత్తరంగా ఉంటుంది. కానీ.. ఈసారి అలా జరగలేదు. ఒకరకంగా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ కు తిరుగులేని ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. కింగ్ నాగార్జునకు మాస్ కథానాయకుడు అనే బిరుదు ఉంది. అయితే ఇందులో విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తున్నారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు కింగ్ నాగార్జున సమర్పకుడిగా ఇట్లు నాగార్జున అనే చిత్రం వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 30న విడుదలవుతుందని స్వయంగా నాగార్జున విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు ఆదర్శ కుటుంబం గురించి పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. అయితే ఇప్పుడు నాగార్జున బాధిత పక్షం లాగా మారిపోయారు. వెంకటేష్ దూకుడు ముందు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకున్నారు.
నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిన్న సినిమా ఇట్లు అర్జున విడుదల మరొకసారి వాయిదా పడింది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా నవంబర్ ఆరుకి మారిపోయింది. ఈ సినిమా విడుదల తేదీ మారెందుకు ఆదర్శ కుటుంబం కారణమైంది. ఇప్పటికే అనేక పర్యాయాలు విడుదల తేదీని ఆదర్శ కుటుంబం సినిమా మార్చుకుంది. దీనికి తోడు ఇట్లు అర్జున కూడా అదే విధంగా విడుదల తేదీలను మార్చుకుంది. వాస్తవానికి ఇట్లు అర్జున సినిమాలు అక్టోబర్ రెండు లేదా తొమ్మిది తేదీలలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గతంలో పోస్టర్లు విడుదల చేశారు. అయితే అదే సమయంలో ఆదర్శ కుటుంబం సినిమా విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇట్లు అర్జున వాయిదా పడింది. కానీ అనుకున్న తేదీలలో ఆదర్శ కుటుంబం విడుదల కాలేదు. దీంతో ఇట్లు అర్జున రిలీజ్ కోసం ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా ఎదురు చూశారు.
ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇట్లు అర్జున కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ ముప్పయిన సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాకు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు ఆయన సైతం అక్టోబర్ 30న సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. ఈసారి విడుదలను వాయిదా వేసే ప్రసక్తి లేదని.. ఇప్పటికే ప్రమోషన్ కు సంబంధించిన కంటెంట్ ను చాలా వరకు విడుదల చేశామని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే మరోసారి ఆదర్శ కుటుంబం సినిమా విడుదల తేదీ మార్పునకు కారణమైంది.
ఆదర్శకుటుంబ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో ఇట్లు అర్జున మరోసారి వాయిదా పడింది. దీంతో నవంబర్ 6న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నవంబర్ 6న కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ ఉంది. ఆ రోజున భారీ బడ్జెట్ రూపొందించిన రామాయణ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల నేపథ్యంలో అదేరోజు ఇట్లు అర్జున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
మరోవైపు అక్టోబర్ 30న విడుదల కావలసిన సమ్మర్ హాలిడేస్ సినిమా కూడా నవంబర్ 6 మారింది. దీంతో ఆ తేదీన విడుదల అయ్యే సినిమాల జాబితాలో మరో చిత్రం చేరింది. ఇలా ఆదర్శ కుటుంబం విడుదల తేది కారణంగా ఇట్లు అర్జునతో పాటు సమ్మర్ హాలిడేస్ సినిమా విడుదల తేదీలు మారిపోయాయి. పలుమార్లు వాయిదా పడిన ఇట్లు అర్జున నవంబర్ ఆరవ తేదీనైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.