Homeఎంటర్టైన్మెంట్Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన జనాల టాక్ ఏంటంటే..

Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన జనాల టాక్ ఏంటంటే..

Adarsha Kutumbam: పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు వెంకటేష్ కెరియర్ లో ఉత్తమమైనవి. ఈ సినిమాలకు సంభాషణలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంట సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేశారు. ఆ సినిమాలకు కూడా సంభాషణలు, కథ మాత్రమే అందించారు. మళ్లీ ఇన్నాళ్లకు తొలిసారిగా తనకు లక్కీ చాంప్ అయిన విక్టరీ వెంకటేష్ తో తొలిసారి సినిమా తీశారు. సంభాషణల రచయితగా.. కథకుడిగా కొనసాగిన త్రివిక్రమ్.. […]

Adarsha Kutumbam: పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు వెంకటేష్ కెరియర్ లో ఉత్తమమైనవి. ఈ సినిమాలకు సంభాషణలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంట సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేశారు. ఆ సినిమాలకు కూడా సంభాషణలు, కథ మాత్రమే అందించారు.

మళ్లీ ఇన్నాళ్లకు తొలిసారిగా తనకు లక్కీ చాంప్ అయిన విక్టరీ వెంకటేష్ తో తొలిసారి సినిమా తీశారు. సంభాషణల రచయితగా.. కథకుడిగా కొనసాగిన త్రివిక్రమ్.. మొట్టమొదటిసారి మెగా ఫోన్ పట్టారు. శ్రీనిధి శెట్టిని కథనాయికగా తీసుకొని ఈ సినిమా రూపొందించారు. గుంటూరు కారం ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రావడంతో చాలా అంచనాలు పెరిగిపోయాయి. అనేక పర్యాయాలు విడుదల వాయిదా పడటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మొత్తానికి ప్రేక్షకుల ముందుకు నేడు ఈ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో.. ఈ రివ్యూ లో చూద్దామా..

మాటలతో మాయ చేసే త్రివిక్రమ్.. కుటుంబ కథా చిత్రాల నాయకుడు వెంకటేష్.. ద్వయం లో వచ్చిన ఆదర్శ కుటుంబం గురించి ప్రేక్షకులు తమ స్పందనను సామాజిక మాధ్యమాలలో చెప్పుకుంటున్నారు.. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కథలో చిట్టిబాబు (విక్టరీ వెంకటేష్) ఒక బ్యాంకులో పనిచేస్తుంటాడు. ఆయన భార్య స్వర్ణ (శ్రీనిధి) చిట్టిలు నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే అప్పులు చేస్తూ ఉంటుంది. కూతురు సంపూర్ణ (యువీన) ప్రతిసారి ప్రేమలో పడుతూ ఉంటుంది. తండ్రికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్) కు చదువు అంతగా రాదు. అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. చిట్టి బాబుకు ఇబ్బందులు తెస్తూ ఉంటాడు. ఇలా కుటుంబంతో నార్మల్ లైఫ్ గడుపుతున్న చిట్టిబాబు కుటుంబంపై కొంతమంది దాడి చేస్తారు. పోలీసు అధికారి దామోదర్ నాయుడు (నారా రోహిత్) దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చిట్టిబాబు ఒక్కసారిగా విలాసవంతమైన భవనంలోకి మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు చిట్టిబాబు కుటుంబం పై దాడి చేయడానికి కారణం ఏంటి.. దీని వెనుక ఉన్నది ఎవరు.. ఎందుకు చేయాల్సి వచ్చింది.. చిట్టిబాబు గతంలో ఏం చేశారు.. సమస్యలలో పడిపోయిన తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఆయన ఏం చేశారు.. అనేది మిగతా కథ అట.

వెంకటేష్ కుటుంబ కథాచిత్రాల హీరో అని అందరికీ తెలుసు. ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమా స్టోరీని రాసుకున్నారు. కుటుంబంలో ఉండే బంధాలు.. కామెడీ.. భావోద్వేగం.. వంటి అంశాలను పొందుపరిచారు. దానికి నేర నేపథ్యాన్ని.. పోరాటాలను జత చేశారు మొత్తంగా వాణిజ్య కథాచిత్రంగా మార్చారు. మొదటి భాగం మొత్తం కామెడీగా సాగిపోతూ ఉంటుంది. రెండవ భాగం మొత్తం పోరాట ఘట్టాలతో అభిమానులకు రోమాలు నిక్క బొడిచే అనుభూతి కలిగిస్తుంది. వాస్తవానికి ఇటువంటి కథ కొత్తది కాకపోయినాప్పటికీ.. అందులో వినోదం పాళ్లను మరింత పెంచడంతో.. అభిమానులకు ఎటువంటి లోటు లేకుండా పోయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కథనం రాష్ట్ర సమయం వరకు బొమ్మ ఇంకా పడలేదు. బహుశా కొద్ది గంటల వ్యవధిలో ఈ సినిమా పడుతుంది. ఆ తర్వాత అసలు టాక్ ఏంటి అనేది తెలుస్తుంది. మరోవైపు ఇటీవల ఈ సినిమా గురించి ఓవర్సీస్ ఏరియాలలో మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి మన రాష్ట్రాలలో విడుదలైన తర్వాత జనాలు ఎలా స్వీకరిస్తారు.. తమ అభిప్రాయాన్ని ఎలా వెల్లడిస్తారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. గతంలో గుంటూరు కారం సినిమాకు ప్రారంభం నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కమర్షియల్గా ఆ సినిమా తమను ఒడ్డున పడేసిందని నిర్మాతలు చెప్పారు. మరి ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper