Homeఎంటర్టైన్మెంట్Getup Srinu: హీరోలనే దాటేసిన గెటప్ శ్రీను రెమ్యూనరేషన్.. ఒక్క రోజు కాల్ షీట్ విలువ...

Getup Srinu: హీరోలనే దాటేసిన గెటప్ శ్రీను రెమ్యూనరేషన్.. ఒక్క రోజు కాల్ షీట్ విలువ ఎంతో  తెలుసా!

Getup Srinu:  ‘జబర్దస్త్’ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని నేడు ఇండస్ట్రీ లో అత్యున్నత స్థాయికి ఎదిగిన కమెడియన్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు గెటప్ శ్రీను. ఈయన చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షలాది మంది ప్రేక్షకులు కేవలం గెటప్ శ్రీను కోసమే ‘జబర్దస్త్’ ని చూసే వారు. ఇప్పుడు సినిమాల్లో కూడా గెటప్ శ్రీను […]

Getup Srinu:  ‘జబర్దస్త్’ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని నేడు ఇండస్ట్రీ లో అత్యున్నత స్థాయికి ఎదిగిన కమెడియన్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు గెటప్ శ్రీను. ఈయన చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షలాది మంది ప్రేక్షకులు కేవలం గెటప్ శ్రీను కోసమే ‘జబర్దస్త్’ ని చూసే వారు. ఇప్పుడు సినిమాల్లో కూడా గెటప్ శ్రీను ఉంటే చాలు , కాసేపు థియేటర్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ ఒక్క ఏడాది లోనే ఆయన నుండి దాదాపుగా 8 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘లెనిన్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అయితే గెటప్ శ్రీను కి ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉండడం వల్ల , ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడట. మేకర్స్ కూడా ఆయనకు కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడడం లేదట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే గెటప్ శ్రీను ఒక్క రోజుకి గాను 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. అంటే నెలకు ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఉదాహరణకు గెటప్ శ్రీను హనుమాన్, మిరాయ్, రాకాస వంటి చిత్రాల్లో హీరో తో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసాడు. ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అంటే కనీసం 30 పని దినాలు ఉంటాయి. ఈ 30 రోజులకు ఆయన అందుకునే రెమ్యూనరేషన్ అక్షరాలా 90 లక్షలు. ఏడాది మొత్తం సినిమాలు చేస్తూ ఉంటాడు కాబట్టి, ఏడాదికి 10 కోట్ల 80 లక్షల రూపాయిలు సంపాదిస్తున్నాడు అన్నమాట. చాలా మంది మీడియం రేంజ్ హీరోలు, రెండేళ్లు కష్టపడి సినిమాలు చేసినప్పటికీ 7 కోట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపారు నిర్మాతలు.

కొంతమంది హీరోలకు అయితే రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడం లేదు. విడుదలై సూపర్ హిట్ అయ్యాక మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. మీడియం రేంజ్ హీరోల దాకా ఎందుకు, మాస్ మహారాజ రవితేజ లాంటి సూపర్ స్టార్ ని ఉదాహరణగా తీసుకోండి. వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, ఆయన గత రెండు చిత్రాలకు రెమ్యూనరేషన్ రూపం లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సంక్రాంతికి విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఫ్లాప్ అయ్యింది , రవితేజ కి ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా రాలేదు. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఇరుముడి’ చిత్రానికి ఆయన నైజాం హక్కులను రెమ్యూనరేషన్ గా అందుకున్నాడు. ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా నైజాం ప్రాంతం నుండి 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా రవితేజ జోబులోకే వెళ్తుంది.

‘ఇరుముడి’ హిట్ అయ్యింది కాబట్టి సరిపోయింది , అదే ఫ్లాప్  అయ్యుంటే ఈ సినిమా కూడా ఉచితంగా చేసినట్టే. అలాంటి పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో గెటప్ శ్రీను ఏడాదికి 10 కోట్ల రూపాయలకు పైగా సంపాదించుకునే రేంజ్ కి వెళ్ళాడు కాబట్టే , ఆయన్ని హీరోలను మించిన సంపాదన అని చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే ఇతని టీం లో ఉండే సుడిగాలి సుధీర్ , ఆటో రామ్ ప్రసాద్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుడిగాలి సుధీర్ ఒక పక్క సినిమాల్లో హీరో గా చేస్తూ , మరో పక్క మోస్ట్ బిజీ యాంకర్ గా కొనసాగుతూ , చేతినిండా డబ్బులు సంపాదిస్తూ పీక్ రేంజ్ లో ఉన్నారు. కానీ ఆటో రామ్ ప్రసాద్ కెరీర్ గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్ లతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి.

అందుకే ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరికీ ఇవ్వనంత రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు రామ్ ప్రసాద్. ఈయనకు వారానికి 4 లక్షల 50 వేల రూపాయిలు ఇస్తున్నారట బిగ్ బాస్ టీం. కానీ ఇది ఇంచుమించు గెటప్ శ్రీను ఒకటిన్నర రోజు రెమ్యూనరేషన్ అన్నమాట. రామ్ ప్రసాద్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత , ఆయనకు కూడా సినిమాల్లో గెటప్ శ్రీను రేంజ్ అవకాశాలను సంపాదించుకోగలడా?,  గెటప్ శ్రీను కెరీర్ ఇదే ఊపు లో రాబోయే రోజుల్లో కూడా సాగనుందా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.  మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper