Flipkart Big Billion Days 2026: ప్రస్తుతం వినాయక చవితి.. ఇది పూర్తయిన కొద్ది రోజులకే దసరా పండుగ వస్తుంది. దసరా పండుగకు ముందు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలుపెడుతుంది. ఈ సీజన్లో బిగ్ బిలియన్ డేస్ గురించి ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ప్రకటన ఇచ్చింది.
ఫ్లిప్కార్ట్ ఇచ్చిన ప్రకటన ప్రకారం వచ్చేనెల అంటే అక్టోబర్ 6 నుంచి బిగ్ బిలియన్ డేస్ మొదలవుతుంది. నవరాత్రి పండుగ సీజన్ ను పురస్కరించుకొని కస్టమర్లకు భారీ ఆఫర్లను ఇవ్వడానికి ఫ్లిప్కార్ట్ ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. బిగ్ బిలియన్ డేస్ లో అమ్మకాలకు సంబంధించి ముందస్తు యాక్సెస్.. బ్యాంకు డిస్కౌంట్లు.. ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్.
ముందస్తు యాక్సెస్
మామూలు వినియోధరల కంటే ముందుగానే డీల్స్ సొంతం చేసుకోవాలంటే తన ప్రత్యేకమైన సభ్యులకు ఫ్లిప్కార్ట్ అనేక రకాల అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకమైన సభ్యులకు బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమయ్యే ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 8 నుంచే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. వారికి ముందస్తుగా ఈ యాక్సెస్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్, ఫ్లిప్కార్ట్ బ్లాక్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సభ్యులకు ఈ అవకాశం ఉంటుంది. దీనివల్ల స్టాక్ పూర్తికాకముందే తక్కువ ధరలకే వస్తువులను దక్కించుకోవచ్చు.
డిస్కౌంట్లు ఎలా ఉంటాయంటే..
బిగ్ బిలియన్ డేస్ లో కస్టమర్లు అదనంగా పొదుపు చేసుకోవడానికి ప్రముఖ బ్యాంకులతో ముందుగానే బాగా సమయం కుదుర్చుకుంది..
ఇన్స్టంట్ డిస్కౌంట్.. యాక్సిస్ బ్యాంక్.. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లు అదేవిధంగా ఈఎంఐ లావాదేవీల మీద 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది.
క్యాష్ బ్యాక్ ఆఫర్స్: ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు అదనపు క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఆఫర్లు, డీల్స్ ఎలా ఉన్నాయి అంటే
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు: ఆపిల్ ఐఫోన్, సాంసంగ్, గూగుల్ పిక్సెల్, రియల్ మీ, వన్ ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్ల మొబైల్ల పై భారీ ప్రైస్ కట్ ఉండే అవకాశం ఉంది. లాప్టాప్ లు.. స్మార్ట్ వాచ్లు.. ఇయర్ ఫోన్ల మీద భారీగా ఆఫర్లు ఉన్నాయి.
గృహోపకరణాలు.. ఆసర్.. హయర్.. జేబీఎల్.. అరిస్టోక్రాట్.. టిసిఎల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి మొదలు పెడితే స్మార్ట్ టీవీలు.. రిఫ్రిజిరేటర్లు.. ఏసీలు.. వాషింగ్ మిషన్ల మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లు లభిస్తాయి.
ఇతర కేటగిరీలు.. ఫ్యాషన్.. హోమ్ డెకర్.. కిచెన్ అప్లైెన్సెస్.. బ్యూటీ ప్రొడక్ట్స్ పై గరిష్టంగా 50 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
బిగ్ బిలియన్ డేస్ ముగిసే తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే సాధారణంగా ఈ సేల్ వాల నుంచి పది రోజుల వరకు సాగే అవకాశం ఉంటుంది. ఇతర ఉత్పత్తుల ధరలు.. డిస్కౌంట్లు.. ఇతర అంశాలు ఎప్పటికప్పుడు ఫ్లిప్కార్ట్ ఆప్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి.