spot_img
Homeఎంటర్టైన్మెంట్Manchu Vishnu: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా... మంచు...

Manchu Vishnu: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా… మంచు విష్ణు

Manchu Vishnu: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య , వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ వ్యక్తిగత సిబ్బంది మృతులల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ ఒకరు. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ కూడా వీర మరణం పొందారు. దీంతో సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయితేజ ఆకస్మిక మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిజేస్తున్నారు. సాయితేజ కుటుంబానికి అండగా నిలబడతామని అంటున్నారు.

Manchu Vishnu
Manchu Vishnu

కాగా  సాయి తేజ్ భార్య శ్యామలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ కుటుంబానికి తాము అండగా ఉంటామని మంచు విష్ణు చెప్పారు. అంతే కాకుండా సాయితేజ… కొడుకు, కుమార్తెల చదువు మొత్తం తమ విద్యాసంస్థ విద్యానికేతన్ భరిస్తుందని ప్రకటించారు. సాయి తేజ్ పిల్లలు చదువు ఇంజనీరింగ్ వరకు తమ విద్యా సంస్థలోనే ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సాయి తేజ కుటుంబాన్ని విద్యనికేతాన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. త్వరలో సాయితేజ కుటుంబాన్ని వారం, పదిరోజుల్లో నేరుగా వెళ్లి కలనున్నానని మంచు విష్ణు చెప్పారు. సాయి తేజ్ ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read: ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన !

మరోవైపు జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో ఇవాళ జరగనున్నాయి. మరికాసేపట్లో కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ ఇంటికి భౌతికకాయాలను తరలిస్తారు. 11గంటల నుంచి సైనికాధికారుల సందర్శనకు అనుమతిస్తారు. ఆ తర్వాత 2గంటల నుంచి రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీ కంటోన్మెంట్‌ బ్రార్‌ స్క్వేర్‌ స్మశాన వాటికల్‌..సైనిక లాంచనాలతో బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read: మరదలి పెళ్ళిలో డాన్స్ ఇరగతీసిన రామ్ చరణ్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper