Sonia Gandhi : దేశ 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదే సమయంలో వందేమాతరం గేయానికి సంబంధించి 150 వ వేడుకలు కూడా అద్భుతంగా సాగాయి. ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేయడానికి ముందు నరేంద్ర మోడీ.. వేలాదిమంది యువత వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఎర్రకోటలో జరిగిన వేడుకలలో నరేంద్ర మోడీ కొత్తగా కనిపించారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. ఎర్రకోట తర్వాత జాతీయ మీడియా దృష్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయి. ఈసారి కూడా అదే స్థాయిలో అక్కడ వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ.. సోనియాగాంధీ.. మల్లికార్జున కార్గే.. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు స్వాతంత్ర వేడుకలకు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు సంబంధించి జాతీయ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో.. ఆ గేయాన్ని పూర్తిగా ఆలపించాలని.. ఆ గేయానికి భారతీయులు గౌరవం ఇవ్వాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన స్వాతంత్ర వేడుకలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వందేమాతరం గేయాన్ని ఆలపిస్తుండగా సోనియాగాంధీ నిలుపుదల చేశారని విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలను కూడా బిజెపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ కావడం.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో.. చివరికి ఆ పార్టీ నాయకులు స్పందించక తప్పలేదు. ” సోనియాగాంధీ వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించకుండా అభ్యంతరం చెప్పారు అనేది పూర్తిగా అబద్ధం. జాతీయగీతం పూర్తి వెర్షన్ ను ఆలపించే ప్రయత్నానికి సోనియాగాంధీ అడ్డు తగలలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే చాలాసేపు నిలబడి ఉన్న నేపథ్యంలో.. ఆయన కోసం ఒక కుర్చీ సోనియా గాంధీ అడిగారు. ఆ కుర్చీలో కూర్చుని ఆయన స్వాతంత్ర వేడుకలలో పాల్గొనాలని సూచించారు. అంత తప్ప వందేమాతరం గేయాన్ని ఆమె నిలుపుదల చేయాలని చెప్పలేదు. ఆమె మాట్లాడింది వేరు. బిజెపి నాయకులు అర్థం చేసుకున్నది వేరు. నెగిటివ్ ప్రచారం చేయడంలో బిజెపి నాయకుల తర్వాత ఎవరైనా అంటూ” కాంగ్రెస్ నాయకులు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఉదయం నుంచి సాగుతున్న ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.
నేటి సోషల్ మీడియా కాలంలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అనే వాళ్లు చాలామంది. ఇలా సాగే ప్రచారాలు కూడా విపరీతంగా ఉంటాయి. ఈ నెగటివ్ ప్రచారానికి ఎవరు మినహాయింపు కాదు. చివరికి సోనియా గాంధీ కూడా నెగిటివ్ ప్రచారం వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందువల్లే సోషల్ మీడియాలో వచ్చే దానిని నమ్మకూడదు. దేనిని కూడా బలంగా విశ్వసించ కూడదు.
Italian lady got triggered by full Vande Mataram.
After all these years in India, the national song still feels foreign to her.
Some people never really arrived.#IndependenceDay #JaiHind #soniagandhi pic.twitter.com/hwL2PKo7MN
— Mr. Playmaker (@TimelessTaless) August 15, 2026