Agnipariksha 2 Judges : ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అగ్ని పరీక్ష 2’ మరికొద్ది గంటల్లోనే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. అయితే స్టార్ మా ఛానల్ కంటే ముందుగానే , ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని జియో హాట్ స్టార్ లో నిన్న అర్థ రాత్రి నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు కొంతమంది కంటెస్టెంట్స్ పట్ల జడ్జీలు , యాంకర్ శ్రీముఖి వ్యవహరించిన తీరు పై తీవ్రమైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇదంతా పక్కన పెడితే ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న యాంకర్ శ్రీముఖి తో పాటు , జడ్జీలుగా వ్యవహరిస్తున్న బిందు మాధవి , అభిజిత్ , నవదీప్ లకు ఇచ్చే రెమ్యూనరేషన్స్ గురించి సోషల్ మీడియా లో ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రచారం అవుతోంది.
ఈ షో లో అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నది ఎవరో తెలుసా?, శ్రీముఖి. ఒక్కో ఎపిసోడ్ కి ఈమె 3 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. మంచి డిమాండ్ ఉన్న యాంకర్ కావడం తో , ఆమెకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇక నవదీప్ , బిందు మాధవి , అభిజిత్ లకు చెరో రెండు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఒక్కో ఎపిసోడ్ కి ఇస్తున్నారట. మొత్తం మీద 21 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే శ్రీముఖి రెమ్యూనరేషన్ 61 లక్షల రూపాయిలు కాగా , జడ్జీలకు చెరో 42 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ షో కి ఆడియన్స్ నుండి రాబోయే రోజుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అదే విధంగా ఎంపికైన 15 మందిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.