Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Garu Trailer Update: 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ అప్డేట్...

Mana Shankara Varaprasad Garu Trailer Update: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..వైరల్ అవుతున్న ట్వీట్!

Mana Shankara Varaprasad Garu Trailer Update: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈపాటికి మూవీ టీం మొత్తం ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా ఉండాలి, కానీ ఎందుకో మిగిలిన సంక్రాంతి సినిమాల ప్రొమోషన్స్ తో పోలిస్తే, శంకర వరప్రసాద్ ప్రొమోషన్స్ విషయం లో బాగా వెనుకపడ్డాడు […]

Mana Shankara Varaprasad Garu Trailer Update: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈపాటికి మూవీ టీం మొత్తం ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా ఉండాలి, కానీ ఎందుకో మిగిలిన సంక్రాంతి సినిమాల ప్రొమోషన్స్ తో పోలిస్తే, శంకర వరప్రసాద్ ప్రొమోషన్స్ విషయం లో బాగా వెనుకపడ్డాడు అనే టాక్ వినిపిస్తోంది. సినిమా ఇంకా పూర్తి కాలేదని, రీ షూట్స్, ప్యాచ్ వర్క్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్ బిజీ ఉండడం వల్ల, ప్రొమోషన్స్ షెడ్యూల్ ని ప్లాన్ చేయలేకపోతున్నాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. కనీసం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఐడియా అయినా ప్రేక్షకులకు ఇవ్వకపోతే ఎలా ?, టీజర్, ట్రైలర్ లాంటివి వదలొచ్చు కదా అని అభిమానులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసారు.

వాళ్ళు రిక్వెస్ట్ చేసినా, చేయకపోయినా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయాల్సిందే కాబట్టి, కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 4న, అనగా ఎల్లుండే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఈ పోస్టర్ లో చిరంజీవి విలన్స్ తో వీరోచితంగా పోరాడుతున్న షాట్ ని చూడొచ్చు. ఇప్పటి వరకు మూవీ నుండి ఇంత మంచి పోస్టర్ బయటకు రాలేదు అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు వచ్చాయి. అందులో ‘మీసాల పిల్ల’ పాట రీసెంట్ గానే 100 మిలియన్ వ్యూస్ ని దాటింది. అదే విధంగా ఆ తర్వాత విడుదలైన శశిరేఖ, మెగా మాస్ విక్టరీ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి కానీ, సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper