Homeఆంధ్రప్రదేశ్‌Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. అవి చురకలు కాదు నిప్పు కణికలు

Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. అవి చురకలు కాదు నిప్పు కణికలు

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి బాగుంటేనే ప్రజల జీవన విధానం బాగుంటుంది. ప్రజల జీవన విధానమే ప్రభుత్వానికి పన్నులు తెచ్చిపెడుతుంది. సక్రమంగా పన్నులు వస్తే అక్కడ ప్రభుత్వం ఆర్థికంగా వృద్ధి బాటలో సాగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే కచ్చితంగా అద్భుతమైన రోడ్లు ఉండాలి. రోడ్లు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఏపీలో గత ప్రభుత్వంలో రోడ్లు అత్యంత […]

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి బాగుంటేనే ప్రజల జీవన విధానం బాగుంటుంది. ప్రజల జీవన విధానమే ప్రభుత్వానికి పన్నులు తెచ్చిపెడుతుంది. సక్రమంగా పన్నులు వస్తే అక్కడ ప్రభుత్వం ఆర్థికంగా వృద్ధి బాటలో సాగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే కచ్చితంగా అద్భుతమైన రోడ్లు ఉండాలి. రోడ్లు ఉంటేనే ఏదైనా జరుగుతుంది.

ఏపీలో గత ప్రభుత్వంలో రోడ్లు అత్యంత దారుణంగా ఉండేవి. ఎటుచూసినా సరే గోతులు ఉండేవి. ప్రభుత్వం కేవలం పంచుడు పథకాలకు మాత్రమే పరిమితం కావడంతో రోడ్లను పట్టించుకున్న వారు లేకుండా పోయారు. అనేక రకాలుగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో రోడ్ల గురించి సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే సాగింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రోడ్లు సరికొత్త హంగులను అదుపుకుంటున్నాయి. అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అభివృద్ధి.. పరిపాలన తీరుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. కపిలేశ్వరపురంలో ఆయన పర్యటించిన తర్వాత.. ఏపీలో రోడ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు…

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో చిరంజీవి పర్యటించారు. జిసిఎల్ ఆస్పత్రి.. సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన హెల్త్ కేర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంతో పోల్చి చూస్తే అనేక రంగాలలో మార్పులు కనిపిస్తున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. రోడ్లు.. వైద్యరంగంలో పురోగతి తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు గత ప్రభుత్వ పరిపాలనతో పోల్చి చూస్తున్నారు. ఇది రాజకీయంగా చర్చకు దారి తీసింది.

చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చారు చిరంజీవి. పలు రంగాలలో కనిపించిన మార్పులను ఆయన ప్రస్తావించారు. రహదారులు గతంతో పోల్చి చూస్తే బాగున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్న విధానం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజలకు అద్భుతమైన సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు. విద్య.. వైద్య రంగాల్లో వస్తున్న మార్పులను ఆయన ప్రశంసించారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలో రోడ్లు.. మౌలిక సదుపాయాలు.. వైద్య సేవల విషయంలో మార్పులు కనిపిస్తున్నాయని ఆయన తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. తద్వారా విశ్లేషకులు ప్రస్తుత.. గత ప్రభుత్వాల పనితీరును విశ్లేషిస్తున్నారు..

చిరంజీవి ఎక్కడ కూడా గత ప్రభుత్వ పాలకుల పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ.. నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో అభివృద్ధి అనేది లేదని చిరంజీవి పరోక్షంగా చెప్పారు. రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని.. ఇప్పుడు రోడ్లు బాగున్నాయని ఆయన  వివరించారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రోడ్లమీద ప్రధానంగా దృష్టి సారించింది. అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయడం మొదలుపెట్టింది. జాతీయ రహదారులను నిర్మిస్తోంది. అంతేకాకుండా మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో తీర్చి దిద్దుతోంది. ప్రజలకు గృహకల్పన యోగాన్ని.. ఇళ్ల పట్టాలను అందిస్తోంది. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా చేపడుతోంది. తద్వారా ఏపీ ప్రజలకు సువర్ణ పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. బహుశా అందువల్లే చిరంజీవి రోడ్ల గురించి.. ఆరోగ్య సేవలు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper