Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఆయన్ని ఈ స్థాయిలో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తను చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ హీరోగా చేసిన పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ‘కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. అలాంటి మహేష్ బాబు చిన్నతనంలోనే తన నటన తో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కొడుకులు దిద్దిన కాపురం సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన విజయశాంతి మహేష్ కి అమ్మగా నటించింది. ఒక షాట్ లో నటిస్తున్నప్పుడు విజయశాంతి ఒక సన్నివేశంలో మహేష్ బాబుని కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో విజయశాంతి నిజంగానే మహేష్ బాబుని కొట్టిందట. దానివల్ల మహేష్ బాబు కి ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు విజయశాంతితో మాట్లాడలేదట.
ఆ తర్వాత విజయశాంతి మహేష్ ను పిలిచి అనుకోకుండా చెయ్యి తగిలింది అది నా తప్పే అంటూ ఆమె సారీ చెప్పినా కూడా మహేష్ బాబు కొద్దిసేపటి వరకు డల్ గా ఉన్నాడట. నిజానికి తను డల్ గా ఉంది విజయ శాంతి తనను చెంప మీద కొట్టినందుకు కాదట.
కొన్ని షాట్స్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా చేయలేదని అయిన కూడా దాన్ని డైరెక్టర్ ఓకే చేశారని చెప్పారట. దాని వల్ల నేను డల్ అయ్యానని స్వయంగా మహేష్ బాబు విజయశాంతి తో చెప్పారట. దాంతో విజయశాంతి కూడా ఒక్కసారిగా మహేష్ బాబు డెడికేషన్ ను చూసి ఆశ్చర్యానికి గురైందట. అప్పటికే కృష్ణ చాలా డెడికేషన్ తో వర్క్ చేసేవాడు. ఇక తన లాగానే మహేష్ బాబు కూడా టాప్ పొజిషన్ కి వెళ్తాడని విజయశాంతి అదే రోజు కృష్ణ గారితో చెప్పిందట.
ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇప్పుడు టాప్ పొజిషన్లో హీరోగా కొనసాగుతుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతి కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే…