Homeఆంధ్రప్రదేశ్‌AE Nookaraju family case: ఏఈ నూకరాజు ఫ్యామిలీ కేసు.. సౌజన్య భర్తను సాధిక్ ఏం...

AE Nookaraju family case: ఏఈ నూకరాజు ఫ్యామిలీ కేసు.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు..వెలుగులోకి దారుణ నిజాలు

AE Nookaraju family case: ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఈ నూకరాజు.. ఆయన భార్య మీనా.. కూతురు సౌజన్య ఆత్మహత్య కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి గతంలో చనిపోయాడు. అతడు అనారోగ్యంతో చనిపోయాడని అందరూ అనుకున్నారు. బంధువులు కూడా అతని మరణం మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఎప్పుడైతే నూకరాజు.. ఆయన భార్య మీనా.. కూతురు సౌజన్య.. ఆత్మహత్య చేసుకున్నారో.. అప్పుడే ఈ వ్యవహారం ఏపీ రాష్ట్రంలో సంచలనంగా […]

AE Nookaraju family case: ఏపీ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఈ నూకరాజు.. ఆయన భార్య మీనా.. కూతురు సౌజన్య ఆత్మహత్య కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి గతంలో చనిపోయాడు. అతడు అనారోగ్యంతో చనిపోయాడని అందరూ అనుకున్నారు. బంధువులు కూడా అతని మరణం మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.

ఎప్పుడైతే నూకరాజు.. ఆయన భార్య మీనా.. కూతురు సౌజన్య.. ఆత్మహత్య చేసుకున్నారో.. అప్పుడే ఈ వ్యవహారం ఏపీ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే సాదిక్ ఆత్మహత్యల వెనుక ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ చంపేసినట్టు పోలీసుల విచారణలో తేరింది. సాదిక్ ఒక బంగారం షాప్ నుంచి సాయినాయుడు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దానిని ఆహారములో పెట్టి జగదీశ్వర్ రెడ్డిని చంపేశారని తెలుస్తోంది. అయితే జగదీశ్వర్ రెడ్డిని సాధిక హత్య చేయడానికి సౌజన్య సహకరించిందని.. జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపించడం ఈ కేసును మరో మలుపు తిప్పింది.

ఆత్మహత్యకు ముందు సౌజన్య లేఖలు రాసింది. నూకరాజు కూడా ఒక నోటు రాశాడు. వారిద్దరూ రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలలో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ప్రస్తావించారు.. ఏ ఈ నూకరాజు.. ఆయన భార్య మీనా.. కుమార్తె సౌజన్య.. మనవడు రియాన్ష్ రెడ్డి గోదావరిలోకి దూకేశారు. రాజమండ్రిలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత విచారణ నిర్వహిస్తుండగా సౌజన్య స్కూటీలో లెటర్లు లభించాయి. నూకరాజు వద్ద కూడా ఒక లెటర్ లభించింది. సౌజన్యకు.. సాదిక్ కు దగ్గర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని సాధిక ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

సౌజన్యకు దగ్గరైన సాదిక్.. ఆమెతో కలిసి ఉన్న ప్రైవేటు వీడియోలను రికార్డు చేశాడు. వాటిని అడ్డం పెట్టుకొని ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. చివరికి సౌజన్య భర్తను కూడా దారుణంగా కొట్టేవాడు. చివరికి రియాన్స్ ను కూడా కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించేవాడు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు తీసుకొచ్చి సౌజన్య భర్తను సాధిక్ చంపేశాడు. అతడు చనిపోయిన తర్వాత సౌజన్య పూర్తిగా సాధిక్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ఆమె ఆస్తులు మొత్తం అతడు స్వాధీనం చేసుకున్నాడు.

చివరికి సౌజన్య తన బాధను సాధిక్ ఇంటి వద్దకు వెళ్లి చెబితే.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. చివరికి మతం మారాలని.. ఒక మతానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని.. నోట్స్ రాయాలని సౌజన్యను సాధిక్ ఇబ్బంది పెట్టేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సౌజన్యను మూడు రోజుల పాటు సాదిక్ విపరీతంగా కొట్టాడు. ఒక దశలో ఉప్పాడ సముద్రం వద్దకు తీసుకెళ్లి అందులో తోసి వేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వెనక్కి లాగాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper