Homeఎంటర్టైన్మెంట్Jayakrishna Gattamaneni: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఆ స్టార్ డైరెక్టర్స్ తో...

Jayakrishna Gattamaneni: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఆ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు షురూ…

Jayakrishna Gattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాంటి నటుడు ఘట్టమనేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబు తర్వాత తరంలో హీరోగా ఘట్టమనేని ఫ్యామిలీని టాప్ లెవెల్ లోకి తీసుకెళ్లడానికి మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయ కృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ భూపతి డైరెక్షన్ లో శ్రీనివాస్ మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి […]

Jayakrishna Gattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాంటి నటుడు ఘట్టమనేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబు తర్వాత తరంలో హీరోగా ఘట్టమనేని ఫ్యామిలీని టాప్ లెవెల్ లోకి తీసుకెళ్లడానికి మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయ కృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ భూపతి డైరెక్షన్ లో శ్రీనివాస్ మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. ఈ మూవీ అంతా ఎఫెక్టివ్ గా లేకపోయిన కూడా జయకృష్ణ తన నటనతో కొంతవరకు జనాలను అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయిందో లేదో అతనితో సినిమా చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరు ప్రశాంత్ వర్మ కాగా, మరొకరు బలగం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు ఎల్దండి కావడం విశేషం… ప్రస్తుతం వేణు దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పెట్టి ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ప్రశాంత్ వర్మ సైతం పెద్ద ప్రాజెక్టులను చేస్తున్నప్పటికి తన ప్రెజెంట్స్ లో ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక కుర్రాడితో జయకృష్ణ ను హీరోగా పెట్టి సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా జయకృష్ణ లుక్స్ చాలా వరకు బెటర్ గా ఉన్నాయి.

కాబట్టి మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. దాంతో రాబోయే సినిమాల్లో కూడా ఆయన హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఘట్టమనేని అభిమానులు సైతం జయకృష్ణ ను చూసి సంబరపడిపోతున్నారు…

రాబోయే రెండు సినిమాలతో ఆయన భారీ
విజయాలను సాధిస్తే ఆయన రేంజ్ మారిపోయే అవకాశమైతే ఉంది. ఇక ఇప్పటికైనా ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు ప్రేక్షకులందరిలో ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper