Jaya Krishna Second Movie: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడం పక్కా అంటూ అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు ఆయన జయకృష్ణ సైతం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మహేష్ బాబు మరో స్టార్ డైరెక్టర్ తో జయకృష్ణ సెకండ్ సినిమాని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జయకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
రీసెంట్ గా మహేష్ బాబును కలిసి ప్రశాంత్ వర్మ ఒక కథను కూడా వినిపించారట. అది జయ కృష్ణకి బాగా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు ఈ మూవీ ని జయకృష్ణతో సినిమా చేయమని చెప్పారట. దానికి ప్రశాంత్ వర్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయనకున్న కమిట్మెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని డైరెక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆయన డైరెక్షన్లో తెరకెక్కుతుందా లేదంటే ఆయన ప్రెజెంట్స్ లో తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కుర్రాళ్లతో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే మహేష్ బాబు జయకృష్ణ కోసం కూడా సెకండ్ సినిమాను సెట్ చేసి పెట్టడం నిజంగా ఘట్టమనేని అభిమానులను ఆనందపరిచే విషయమనే చెప్పాలి…శ్రీనివాస మంగాపురం సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మరికొంతమంది స్టార్ట్ డైరెక్టర్లు సైతం జయకృష్ణ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి…