Homeఎంటర్టైన్మెంట్Srinivasa Mangapuram: 'శ్రీనివాస్ మంగాపురం' లో మహేష్ బాబు.. అసలు ట్విస్ట్ ఇదీ...

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస్ మంగాపురం’ లో మహేష్ బాబు.. అసలు ట్విస్ట్ ఇదీ…

Srinivasa Mangapuram: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…చాలా తక్కువ సమయంలోనే ఆయన స్టార్ హీరోగా అవతరించాడు. ఇకమీదట కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆయన అనుకున్న స్థాయిలో హీరోగా రాణించలేదు. ఇప్పుడు తన కొడుకైన జయ కృష్ణ సైతం ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. […]

Srinivasa Mangapuram: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…చాలా తక్కువ సమయంలోనే ఆయన స్టార్ హీరోగా అవతరించాడు. ఇకమీదట కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆయన అనుకున్న స్థాయిలో హీరోగా రాణించలేదు. ఇప్పుడు తన కొడుకైన జయ కృష్ణ సైతం ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్న ఆయన ఈనెల 30వ తేదీన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఈ మూవీ కోసం మహేష్ బాబు సైతం ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడట.

ఆయన క్లైమాక్స్ లో వస్తాడా? లేదంటే ఇంటర్వెల్లో కనిపిస్తాడా అనే విషయం క్లారిటీగా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు గాని మహేష్ బాబు గాని ఈ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.

అయితే ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచి థియేటర్లోనే రివిల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తన అన్న కొడుకు అయిన జయకృష్ణ కోసం మహేష్ బాబు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఏదేమైనా కూడా తనని స్టార్ హీరోగా మార్చాలనే ప్రయత్నంలో మహేష్ బాబు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper